చాయ్ అంటే ఇష్టపడనివారు ఎవరూ ఉండరు.దాదాపు చాలామంది రోజూ టీ తాగుతారు.
రోజు ఉదయం, సాయంత్రం వేడి వేడి టీ తాగడానికి ఇష్టపడతారు.కొంతమంది అయితే రోజుకు నాలుగైదు కప్పుల చాయ్ కూడా తాగుతారు.
అయితే ఛాయ్‌లలో అనేక రకాలు ఉన్నాయి.అల్లం టీ, మసాలా, బాదం, గ్రీన్, లెమన్ టీ లాంటివి చాలా ఉన్నాయి.
కానీ తాజాగా పింక్ రంగు చాయ్ సోషల్ మీడియా( Social media)లో వైరల్ గా మారింది.మహారాష్ట్రలోని కొల్లాపూర్( Maharashtra ) లో ఈ పింక్ రంగు చాయ్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

ఈ పింక్ రంగు ఛాయ్‌ని బీట్‌రూట్ పొడితో తయారుచేస్తున్నారు.కొల్లాపూర్( Kolhapur) లోని సీపీఆర్ హాస్పిటల్ సమీపంలో సీపీఆర్ చౌక్‌లో కస్బా బావ్డాకు వెళ్లే దారిలో ఈ టీ లభిస్తుంది.అక్కడ సంతోష్ కుమార్ నావాలే అనే వ్యక్తి చాయ్ దుకాణాన్ని పడుపుతున్నాడు.అక్కడే దొరికే ఈ ఛాయ్‌ను తాగేందుకు జనం క్యూ కడుతున్నారు.అంతకుముందు అతడు పూల అలంకరణ బిజినెస్ చేసేవాడు.అయితే అతడు టీ ప్రియుడు కావడంతో.
ఏదైనా కొత్తరకం టీని జనాలకు పరిచయం చేయాలని ఉద్దేశంతో ఈ పింక్ ఛాయ్‌ను కనిపెట్టాడు.

బీట్‌రూట్ పొడి కలిపి తయారుచేసే ఈ పింక్ రంగు టీ టేస్ట్ జనాలకు బాగా నచ్చింది.చాయ్ మసాలా, బీట్ రూట్ పౌడర్ కలిపి దీనిని తయారుచేస్తున్నాడు.ఇందుకోసం ముందుగా పాలను గిన్నెలో మరిగిస్తాడు.
అవి కాగిన తర్వాత వాటిల్లో టీ పొడి, పంచదార, యాలకులు, చాయ్ మసాలా, బీట్ రూట్ పొడి కలుపుతాడు.ఆ తర్వాత మళ్లీ కాసేపు మరిగిస్తాడు.
ఈ చాయ్ సువాసన బాగుండటంతో పాటు టేస్ట్ కూడా అదిరిపోతుంది.దీంతో జనాలు కూడా తెగ తాగేస్తున్నారు.







