బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అనసూయ( Anasuya ) ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు దూరమయ్యారు.ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె తనకు సంబంధించిన విషయాలతో పాటు సినిమాలోకి సంబంధించిన విషయాల గురించి కూడా మాట్లాడుతుంటారు.
ఈమె యాంకర్ గా ఎప్పుడైతే గుర్తింపు సంపాదించుకున్నారో ఆ క్షణం నుంచి భారీగా ట్రోల్స్ కూడా ఎదుర్కోవడం జరుగుతుంది.అనసూయ పరోక్షంగా పలువురు హీరోల గురించి సెలబ్రిటీల( Celebrities ) గురించి కామెంట్ చేయడం సదరు అభిమానులు ఈమెపై తీవ్రస్థాయిలో విరుచుకుపడడం జరుగుతుంది.

ఈ విధంగా అనసూయ పలు వివాదాల ద్వారా పెద్ద ఎత్తున వార్తలలో నిలిచిన సంగతి తెలిసిందే.ముఖ్యంగా విజయ్ దేవరకొండ ( Vijay Devarakonda ) గురించి ఈమె పరోక్షంగా ట్విస్ట్ చేస్తూ ఆ హీరో అభిమానులతో భారీగా వివాదానికి తెర లేపారు.అయితే విజయ్ ఫ్యాన్స్ ఈమెను భారీ స్థాయిలో ట్రోల్స్ చేయడంతో విసిగిపోయినటువంటి ఈమె ఈ వివాదానికి ముగింపు పలకబోతున్నాను అంటూ సమాధానం చెప్పుకొచ్చారు.అయితే ఇన్ని రోజులు పాటు తన గురించి ఎవరేమన్నా సైలెంట్ గా ఉన్నటువంటి అనసూయ మరోసారి సోషల్ మీడియా ద్వారా చేసినటువంటి పోస్ట్ వైరల్ అవుతుంది.
ఈ క్రమంలోనే అనసూయ తాజాగా చేసిన ఈ పోస్టులో ఎవరి పేరు ప్రస్తావించకపోయిన ఈమె ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ చేశారో అర్థం కావడం లేదు.ఈ సందర్భంగా ఈమె ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ నేను వాళ్లకు ఎంతో ముఖ్యం.
నా ప్రమేయం ఉన్నా.లేకున్నా నాకు సంబంధం ఉన్నా లేకున్నా నా పేరు ఎత్తకుండా ఒక్క డిస్కషన్ కూడా జరగదు.
నాపై అంత డిపెండ్ అయి ఉన్నారు.నా పేరు లేకుండా పాపం ఏది చేయలేకపోతున్నారు అంటూ ట్వీట్ చేశారు.
ప్రస్తుతం అనసూయ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈమె ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ చేశారు అసలు మిమ్మల్ని ఎవరేమన్నారు అంటూ నేటిజన్స్ పెద్ద ఎత్తున కామెంట్ చేస్తున్నారు.







