మెగా డాటర్ శ్రీజ (Sreeja) భర్త ప్రస్తుతం శ్రీజకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటారు.శ్రీజ రెండవ వివాహం చేసుకొని మరొక బిడ్డకు జన్మనిచ్చారు.
అయితే ఈమె తన భర్తతో వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకొని విడిపోయారంటూ కూడా వార్తలు వస్తున్నాయి.అయితే ఈ వార్తలపై శ్రీజ కాని కళ్యాణ్ దేవ్ (Kalyan Dev)కానీ స్పందించలేదు.
అయితే వీరిద్దరి విడాకులు (Divorce) అధికారకంగా వచ్చాయని కానీ ఈ విషయాన్ని మాత్రం మెగా ఫ్యామిలీ చాలా రహస్యంగా ఉంచారని తెలుస్తోంది.
ఇకపోతే కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా చేసే పోస్టులు కనుక చూస్తే వీరిద్దరూ విడిపోయారని స్పష్టంగా అర్థం అవుతుంది.కోర్టు పర్మిషన్ తో వారంలో కేవలం నాలుగు గంటలు మాత్రమే తన కూతురితో గడిపే అవకాశం ఈయనకు ఉంది.దీంతో ఈయన వారంలో ఈ నాలుగు గంటలే నాకు ఆనందకరమైన క్షణాలు అంటూ ఎప్పటికప్పుడు తన కుమార్తెను మిస్ అవుతున్నానని పోస్టులు చేస్తూ ఉంటారు.
ఇలా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే కళ్యాణ్ తాజాగా సోషల్ మీడియా వేదికగా ఈయన చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
తాజాగా కళ్యాణ్ దేవ్ ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో.మనం ఎలాంటి ప్రపంచంలో బ్రతుకుతున్నాం అంటే మోసం ఎప్పటికీ ఎవరిని ఆశ్చర్యపరచలేదు.కానీ నమ్మకం మాత్రమే ఆ పని చేయగలదు అంటూ ఈయన షేర్ చేసినటువంటి ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మరి ఈయన నమ్మకం మోసం అంటూ ఎవరిని టార్గెట్ చేసి ఈ పోస్ట్ చేశారో తెలియదు కానీ ప్రస్తుతం ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ కచ్చితంగా ఈ పోస్ట్ శ్రీజను ఉద్దేశించే కళ్యాణ్ దేవ్ చేశారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.