నల్లగొండ జిల్లా:దేవరకొండ పట్టణంలోని 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి పేరుకే పెద్ద ఆస్పత్రి కానీ,ఎలాంటి మౌలిక వసతులు లేకుండా రోగుల పాలిట శాపంగా మారిందని పేషెంట్లు,వారి బంధువులు ఆరోపిస్తున్నారు.ఓకే బెడ్ పై ఇద్దరికి,ఓకే స్టాండ్ పై ముగ్గురికి సెలైన్ బాటిళ్లు ఎక్కిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దేవరకొండ ఏరియా ఆస్పత్రికి( Devarakonda Area Hospital ) మారుమూల గిరిజన ప్రాంతాల నుండి రోజుకి వందల మంది రోగులు వస్తారు.అయినా ఆసుపత్రిలో సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నామని,డాక్టర్లు సమయాపాలన పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటం మాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పేరుకే 100 పడకల ఆసుపత్రి కట్టించామని చెప్పుకునే నాయకులు ఇలాంటి విషయాలపై దృష్టి సారించాలని,ఎన్నిసార్లు ఆరోపణలు వచ్చినా అధికారుల్లో,డాక్టర్లల్లో మార్పు రాలేదని రోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఆసుపత్రిలో వసతులను,సిబ్బంది పని తీరును మెరుగుపరిచి, ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.







