మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును హైదరాబాద్ లోని సీబీఐ కోర్టు విచారించింది.ఈ క్రమంలో నిందితులను పోలీసులు కోర్టులో హజరుపరిచారు.
ఈ హత్య కేసులో సీబీఐ ఫైనల్ ఛార్జ్ షీట్ ను రీసబ్మిట్ చేసింది.కాగా ఈ కేసులో జూన్ 30వ తేదీన సీబీఐ దర్యాప్తు ముగిసిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్న ఆరుగురు నిందితులు వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఉమా శంకర్ రెడ్డి, గంగిరెడ్డి, సునీల్ యాదవ్ లను అధికారులు న్యాయస్థానం ఎదుట హాజరు పరిచారు.ఈ నేపథ్యంలో విచారణ జరిపిన ధర్మాసనం తదుపరి విచారణ ఆగస్ట్ 14 కు వాయిదా వేసింది.







