మిరప పంటలో రెక్కల పురుగుల నివారణ కోసం చర్యలు..!

మిరప ( Chilli Crop ) ప్రధాన వాణిజ్య పంటలలో ఒకటి.భారతదేశం నుండి మిరప అంతర్జాతీయంగా అధికంగా ఎగుమతి అవుతోంది.

 How To Control Pests In Chilli Crop Details, Control Pests ,chilli Crop, Green C-TeluguStop.com

రెండు తెలుగు రాష్ట్రాలలో అధిక విస్తీర్ణంలో సాగు అవుతున్న పంటలలో మిరప పంట కూడా ఒకటి.అయితే ఈ పంట పై అవగాహన లేకపోవడంతో చాలామంది రైతులు ( Farmers ) తీవ్ర నష్టాలను ఎదుర్కొని అప్పుల పాలవుతున్నారు.

కేవలం కొద్ది మంది మాత్రమే అధిక దిగుబడి సాధించి లాభాలు పొందుతున్నారు.

మిరప పంట ఖరీఫ్, రబీ కాలాలలో సాగు చేస్తారు.

వర్షాధారంగా మిరపను పండించాలంటే నల్లరేగడి నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి.అలా కాకుండా నీటి వనరులు బాగా ఉండే అన్ని నేలలు ఈ పంట సాగుకు అనుకూలంగానే ఉంటాయి.

ముందుగా నేలను నాలుగు సార్లు దుక్కి దున్ని, రెండుసార్లు గుంటక తోలాలి.మిరప నారను పెంచేందుకు ఒక సెంటు నేల సరిపోతుంది.650 గ్రాముల విత్తనాలను( Chilli Seeds ) నారుగా పోసుకోవాలి.విత్తనాలకు ముందు 150 గ్రాముల ట్రైసోడియం ఆర్థోఫాస్పేట్, 8 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్, 3 గ్రా.

మాంకోజెబ్ ను పి విత్తన శుద్ధి చేసుకుంటే వివిధ రకాల తెగుళ్లు, చీడపీడల బెడద ఉండదు.

Telugu Agriculture, Chilli Crop, Chilli, Chilli Farmers, Crop, Control, Green Ch

నారు పోసిన ఆరు వారాలకు మొక్కలను ప్రధాన పొలంలో నాటుకోవాలి.ఒక ఎకరం పొలంలో పది టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి.భూమిలో ఉండే తేమశాతాన్ని బట్టి 10 నుంచి 15 రోజులకు ఒకసారి నీటితడులను అందించాలి.

నేలలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.మిరప పంటకు రెక్కల పురుగుల బెడద( Pests ) చాలా ఎక్కువ.

ఈ పురుగులు ఆకుల అడుగుభాగాన్ని చేరి మొత్తం రసాన్ని పీల్చడంతో ఆకులు పైకి ముడుచుకొని పోతాయి.

Telugu Agriculture, Chilli Crop, Chilli, Chilli Farmers, Crop, Control, Green Ch

దీంతో మొక్కకు పూత, పిందే నిలిచిపోతుంది.ఈ పురుగులను సకాలంలో గుర్తించి మూడు గ్రాముల ఫాసలోన్ ను ఒక లీటర్ నీటిలో కలిపి మొక్కల ఆకులు పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేయాలి.మొక్కలు నాటిన 15వ రోజు, 45వ రోజు ఫిప్రోనిల్ 0.3% గుళీకలను ఒక ఎకరానికి ఎనిమిది కిలోల చొప్పున భూమిలో తేమ ఉన్న సమయంలో మొక్కలకు అందించడం వల్ల ఈ పురుగుల బెడద ఉండదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube