తెలుగు అమ్మాయైన ప్రియాంక జవాల్కర్( Priyanka Jawalka ) తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమని చెప్పాలి.చూడటానికి చాలా అందంగా ఉండటమే కాకుండా నటన పరంగా కూడా మంచి టాలెంట్ ఉంది.
కానీ స్టార్ హీరోయిన్ గా మాత్రం సక్సెస్ కాలేకపోతుంది.అయితే ఇదంతా పక్కన తమ ఫ్యాన్ తన కోసం ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని కామెంట్ చేయగా ఇంతకు దేనికోసం ఫైట్ చేయనున్నాడో తెలుసుకుందాం.
ప్రియాంక కెరీర్ మొదట్లో షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ మంచి గుర్తింపు అందుకొని టాలీవుడ్ లో అడుగు పెట్టింది.అలా తొలిసారిగా 2017 లో కలవరమాయే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వగా ఈ సినిమాతో అంతగా కూడా సక్సెస్ అందుకోలేకపోయింది ప్రియాంక.ఆ తర్వాత విజయ్ దేవరకొండ సరసన టాక్సీవాలా( Taxiwaala )లో నటించింది.ఇక తిమ్మరుసు, ఎస్ ఆర్ కళ్యాణ మండపం సినిమాతో కూడా మంచి సక్సెస్ అందుకోగా మంచి అభిమానం సంపాదించుకుంది.
ఇక ఈ బ్యూటీ మొదట్లో చూడడానికి అంత అందంగా ఆకట్టుకోలేకపోయినా.ఇప్పుడు మాత్రం తెగ గ్లామర్ షో తో అందాల విందు వడ్డిస్తుంది.తెగ ఫోటో షూట్ లు చేయించుకుంటూ అభిమానులను బాగా ఫిదా చేస్తుంది.
సోషల్ మీడియా( Social media )లో కూడా బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది.అందులో కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.నిత్యం ఏదో ఒక ఫోటో తో కుర్రాళ్లను చూపులు తిప్పుకోకుండా చేస్తుంది.
అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా తన ఫాలోవర్స్ తో తెగ ముచ్చట్లు కూడా పెడుతుంది.ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా కొన్ని ఫోటోలు షేర్ చేసుకోగా ప్రస్తుతం ఆ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.
అయితే ఆ ఫోటోలు చూసిన తన ఫాలోవర్స్ బాగా లైక్స్ కొడుతున్నారు.అంతేకాకుండా అందంగా ఉన్నావంటే కామెంట్ కూడా పెడుతున్నారు.ఇక తన వీరాభిమానులు మాత్రం చాలా ఫీల్ అవుతున్నారు.కారణం తనకి ఇంత అందం, టాలెంట్ ఉన్నా కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోయిన్ హోదాకు రావట్లేదు అని బాధపడుతున్నారు.
దీంతో తన అభిమాని.నా దృష్టిలో నువ్వు కాజల్ అగర్వాల్ తర్వాత సెకండ్ టాప్ మోస్ట్ హీరోయిన్ వి అక్క.
ఇండస్ట్రీలో మన తెలుగు వాళ్లని ఎదగనివ్వరు.మన తెలుగువారిలో ఎంతో టాలెంట్ ఉంది.నేను నీ కోసం ఫైట్ చేస్తా లవ్ యు అక్క.మీరు నా ఫేవరెట్ హీరోయిన్ అంటూ కామెంట్ చెయ్యగా.వెంటనే మరి కొంతమంది అభిమానులు మీకోసం మేము కూడా ఫైట్ చేస్తాము అంటూ సపోర్ట్ చేస్తున్నారు.ఇక ప్రస్తుతం చిన్నచిన్న సినిమాలలో మాత్రమే అవకాశాలు అందుకుంటుంది.
కానీ కొంతవరకైనా మంచి సక్సెస్ అందుకుంటుంది.ఇక తను ఇలాగే బాగా కష్టపడితే అంతేకాకుండా ఇంతే అభిమానం తోడుంటే ఇప్పుడు కాకుండా భవిష్యత్తులో కూడా స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు
.