తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన( Rashmika Mandana ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప( Pushpa ) సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా కూడా మారిన విషయం తెలిసిందే.
టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ సినిమాలలో కూడా నటించి హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకుంది.ఇకపోతే తెలుగులో ఈ ముద్దుగుమ్మకు ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.
భాషతో సంబంధం లేకుండా తన అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది రష్మిక.
అలాగే అందం యువత మతులు పోగొట్టడంతో పాటు నేషనల్ క్రష్ గా కూడా గుర్తింపు తెచ్చుకుంది.రష్మిక చేతిలో పలు ప్రాజెక్టులు ఉన్నాయి.పుష్ప సినిమాకి పాటు మరికొన్ని సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంది రష్మిక.
ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో రష్మిక కు సంబంధించిన ఒక వీడియో చక్కర్లు కొడుతోంది.ఆ వీడియోలో రష్మిక బూతులు మాట్లాడింది.చూస్తుంటే ఎవరి దగ్గరో నేర్చుకుని మరీ ముద్దుముద్దుగా తిడుతున్నట్లుంది.ఎవర్ని తిడుతుందనేది రివీల్ చెయ్యలేదు కానీ అచ్చ తెలుగులో అదరగొట్టేసింది.
ఆ వీడియోలో రష్మిక మందన మాట్లాడుతూ.నమస్తే, ఎట్లా ఉన్నారు? అంటూ పద్ధతిగా మొదలెట్టిన రష్మిక.వచ్చేసెయ్, మస్తుంది, నీ అమ్మా, ఏంది? కొడదాం అంటూ గట్టిగా నవ్వేసింది.ఇంతకీ అమ్మడు అసలు ఎందుకలా మాట్లాడింది, ఏంటా బూతులు,ఎవరిని తిట్టింది? సరదాగా వీడియో కోసమే అలా మాట్లాడిందా? అనేది తెలియదు.కానీ ఈ వీడియోని చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.కొందరు రష్మికకీ అనుగుణంగా కామెంట్స్ చేస్తుండగా మరి కొందరు ఆమెపై మండిపడుతున్నారు.రష్మిక ఎంతో క్యూట్ గా మాట్లాడుతోంది అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు అభిమానులు.ఇకపోతే రష్మిక మందన సినిమాల విషయానికి వస్తే.
అల్లు అర్జున్ తో పుష్ప 2( Pushpa 2 ) సినిమాలో నటించడంతోపాటు బాలీవుడ్ లో యానిమల్ అనే సినిమాలో నటిస్తోంది.