Fight Master Kanal Kannan : పైట్ మాస్టర్ కనల్ కన్నన్ ని అరెస్టు చేసిన పోలీసులు.. అంతా ఆ వీడియో వల్లే?

సోషల్ మీడియా( Social Media ) వాడకం విపరీతంగా పెరిగిపోయిన తర్వాత సెలబ్రిటీలకు సంబంధించిన ప్రతి ఒక్క చిన్న విషయాలు కూడా సోషల్ మీడియాలో అవుతూ ఉంటాయి.అయితే కొన్ని కొన్ని సార్లు సోషల్ మీడియా సెలబ్రిటీలను ఇబ్బంది పెట్టేలా ఉండడంతో పాటు వారికి చిక్కులు తెచ్చి పెడుతూ ఉంటుంది.

 Fight Master Kanal Kannan Arrested For Sharing Video Of Pastor Dancing With Wom-TeluguStop.com

కొన్ని కొన్ని సార్లు సెలబ్రిటీలకు సంబంధించిన రూమర్లను కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ సెలబ్రిటీలను ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు.అంతేకాకుండా ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తూ పెద్దదిగా చేస్తూ ఉంటారు.

తాజాగా ఒక సెలబ్రిటీ విషయంలో అలాంటిదే జరిగింది.

తాజాగా నాగర్ కోయిల్( Nagercoil ) కి చెందిన సైబర్ క్రైమ్ పోలీసులు ఫైట్ మాస్టర్ కనల్ కన్నన్‌( Fight Master Kanal Kannan ) ను అరెస్టు చేశారు.ఆయన షేర్ చేసిన వీడియోనే ఆయనను అరెస్టు అయ్యేలా చేసిందని చెప్పవచ్చు.ఒక మతం గురించి ఆయన షేర్ చేసిన వీడియో వైరల్ అవ్వడంతో పాటు వివాదానికి కూడా కారణం అయ్యింది.

కాగా ఇటీవల కొద్దిరోజుల క్రితం కనల్ కన్నన్‌ ఒక వీడియోను షేర్ చేశాడు.ఆ వీడియోలో ఒక మతం వాళ్ళ మనోభావాలను దెబ్బతీసేవిధంగా ఉండటంతో ఆ వీడియోపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ వీడియో మనదేశానికి సంబంధించింది కానప్పటికీ పలువురి మనోభావాలు దెబ్బతిన్నాయి.దాంతో వారు సైబర్ క్రైమ్ పోలీసుల( Cybercrime Police ) దృష్టికి తీసుకెళ్లారు.దాంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.అయితే కనల్ కన్నన్ ఇలా అరెస్ట్ అవ్వడం కొత్తేమి కాదు గతంలో కూడా ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.తాజాగా పోలీసులు మరోసారి కనల్ కన్నన్‌ ను అదుపులోకి తీసుకోవడంతో ఈ విషయం కాస్త సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube