మహానటి ఫేం కీర్తి సురేష్( Keerthy Suresh ) కెరీర్ ఆశాజనకంగా లేదు అనేది అందరికి తెల్సిందే.గత ఏడాది సర్కారు వారి పాట సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కీర్తి సురేష్ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
మహేష్ బాబు కు జోడీగా నటించి మెప్పించిన కీర్తి సురేష్ ఆ తర్వాత నాని కి జోడీగా దసరా సినిమా( Dasara ) లో నటించి మెప్పించింది.పాన్ ఇండియా స్థాయి లో దసరా సినిమా హిట్ అవుతుందని అంతా భావించారు.
కానీ దసరా సినిమా నిరాశ పర్చింది.అయితే వెన్నెల పాత్ర తో కీర్తి సురేష్ కి పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది.

అయినా కూడా ఆశించిన స్థాయి లో ఆఫర్లు రావడం లేదు.సోషల్ మీడియా లో కీర్తి సురేష్ కి పెద్దగా బజ్ క్రియేట్ అవ్వడం లేదు.స్కిన్ షో కు ఈమె నో అనడంతో పాటు ఇతర కారణాల వల్ల కీర్తి సురేష్ కు టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు రావడం లేదు.వచ్చే నెలలో ఈమె భోళా శంకర్ సినిమా( Bhola Shankar ) తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.
ఆ సినిమా లో కీర్తి సురేష్ హీరోయిన్ కాదు అనే విషయం తెల్సిందే.చిరంజీవి కి చెల్లి పాత్ర లో కీర్తి సురేష్ గా నటించింది.ఆ విషయమై క్లారిటీ ఇవ్వడం జరిగింది.

తమన్నా హీరోయిన్ గా నటించిన ఆ సినిమా లో కీర్తి సురేష్ చెల్లి పాత్ర( Chiranjeevi Sister Role ) లో నటించడం వల్ల ఎంత వరకు ప్రయోజనం ఉంటుంది… ఆమె పాత్ర ఎంత వరకు కెరీర్ కి ఉపయోగపడుతుంది అనేది తెలియాల్సి ఉంది.మొత్తానికి కీర్తి సురేష్ యొక్క సినీ ఆఫర్లు భోళా శంకర్ సినిమా ఫలితం పై ఆధారపడి ఉంటుందని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.భోళా శంకర్ సినిమా సూపర్ హిట్ అయ్యి… కీర్తి సురేష్ పాత్రకు మంచి పేరు వస్తే అప్పుడు ఇతర సినిమా ల్లో ఆఫర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
అంతే తప్ప కీర్తి సురేష్ కు ప్రత్యేకంగా ఆఫర్లు వస్తాయని మాత్రం క్లారిటీ లేదు.







