దెందులూరు నియోజకవర్గం నాయకులు మరియు వీర మహిళల సమావేశంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సంచలన వ్యాఖ్యలు చేశారు.రెండో దశ వారాహి విజయ యాత్రలో( Varahi Vijaya Yatra ) భాగంగా ఏలూరు లో జరిగిన బహిరంగ సభలో వాలంటీర్ల వ్యవస్థ పై( Volunteer System ) పవన్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి.
ఈ క్రమంలో వాలంటీర్లను తప్పు పట్టడం పట్ల పవన్ క్షమాపణలు చెప్పాలని అధికార పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.ఇదే సమయంలో పవన్ వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు కూడా జారీ చేయడం తెలిసిందే.
పరిస్థితి ఇలా ఉంటే మంగళవారం దెందులూరు పార్టీ నాయకుల సమావేశంలో పవన్ మరోసారి వాలంటీర్ల వ్యవస్థ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

వాలంటీర్ల సమాచారం ఎస్పీ, కలెక్టర్ ఆఫీసుల్లో పెట్టాలని పవన్ డిమాండ్ చేశారు.వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కానప్పుడు ప్రజల సమాచారం ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు.ఒక ఎమ్మార్వో తప్పు చేస్తే పై అధికారికి ఫిర్యాదు చేయవచ్చు.
మరి ప్రజల సమాచారం తెలుసుకుంటున్న వాలంటీర్లు తప్పు చేస్తే ఎవరికి చెప్పాలి.అని ప్రశ్నించారు.
వాలంటీర్లకు ప్రజల డబ్బుతో జీతాలు ఇస్తున్నారు.కాబట్టి ప్రతి ఒక్క వాలంటీర్ సమాచారం ఎస్పి, కలెక్టర్ కార్యాలయాల్లో పెట్టండి.
ఏదైనా వాలంటీర్ తప్పు చేస్తే కంప్లైంట్ కోసం వాట్సాప్ గ్రూప్.టోల్ ఫ్రీ నెంబర్ కూడా అందుబాటులోకి తీసుకురావాలని వైసీపీ ప్రభుత్వాన్ని పవన్ డిమాండ్ చేయడం జరిగింది.







