మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ను( Trivikram Srinivas ) కోట్ల సంఖ్యలో అభిమానులు అభిమానిస్తారు.త్రివిక్రమ్ సినిమాలలో డైలాగ్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయనే సంగతి తెలిసిందే.
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ స్థాయికి చేరుకున్నారు.త్రివిక్రమ్ శ్రీనివాస్ సక్సెస్ వెనుక ఎంతో కష్టం ఉంది.
ప్రముఖ టాలీవుడ్ సింగర్ నిహాల్( Singer Nihal ) ఒక ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
చక్రి మ్యూజిక్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో చాలా సినిమాలకు నేను పాటలు పాడానని ఆయన కామెంట్లు చేశారు.
సునీల్, ఆర్పీ, త్రివిక్రమ్ గొప్ప స్థాయికి చేరుకున్నారని నిహాల్ అన్నారు.వాళ్లను కలవాలని నేను అడగలేదని నిహాల్ చెప్పుకొచ్చారు.అవకాశాలు వస్తే మ్యూజిక్ డైరెక్టర్ గా కెరీర్ ను కొనసాగించాలని భావిస్తున్నానని నిహాల్ అన్నారు.ఇది పోటీ ప్రపంచం అని ఇక్కడ నిలదొక్కుకోవడం సులువు కాదని ఆయన తెలిపారు.

నేను ప్రస్తుతం టీచింగ్ చేస్తున్నానని ఆ రంగంలో సంతోషంగా ఉన్నానని నిహాల్ వెల్లడించారు.నాకు అందరు సింగర్లు చాలా ఇష్టమని రఫి గారి పాటలు అంటే నాకు ఇష్టమని ఆయన పేర్కొన్నారు ఆయన పాటలు వింటుంటే ఏడుపు వస్తుందని నిహాల్ వెల్లడించారు.ఆర్పీ, మణిశర్మ, వందేమాతరం శ్రీనివాస్ సినిమాలకు ఎక్కువగా పని చేశానని నిహాల్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఉదయ్ కిరణ్ తో( Uday Kiran ) నేను బాగానే కాంటాక్ట్ లో ఉన్నానని నిహాల్ చెప్పుకొచ్చారు.ఆర్పీని కలవడానికి వెళ్లిన సమయంలో సునీల్, త్రివిక్రమ్ తో పరిచయం ఏర్పడిందని ఆయన తెలిపారు.నేను, త్రివిక్రమ్ కలిసి ఒక నిర్మాతను కలవడానికి వెళ్లగా అతను మాకు ఛాన్స్ ఇవ్వలేదని నిహాల్ అన్నారు.
ఆ ఛాన్స్ ఇవ్వని వ్యక్తి తర్వాత కాలంలో త్రివిక్రమ్ సినిమాలో డబ్బింగ్ చెప్పడానికి వచ్చాడని నిహాల్ పేర్కొన్నారు.నేను, త్రివిక్రమ్ వేస్ట్ అని అవమానించిన వ్యక్తి తర్వాత రోజుల్లో త్రివిక్రమ్ మూవీలో డబ్బింగ్ చెప్పాడని ఆయన చెప్పుకొచ్చారు.







