చియా సీడ్స్ ఆరోగ్యాన్నే కాదు అందాన్ని పెంచుతాయి.. ఎలా వాడాలో తెలుసా?

చియా సీడ్స్.( Chia Seeds ) వీటి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు.

 How To Get White Glowing Skin With Chia Seeds Details! Skin Whitening, Glowing S-TeluguStop.com

ఇటీవల రోజుల్లో చియా సీడ్స్ వినియోగం బాగా పెరిగింది.ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలని భావిస్తున్న వారు తప్పకుండా తమ డైట్ లో చియా సీడ్స్ ను చేర్చుకుంటున్నారు.

వెయిట్ లాస్ కు మాత్రమే కాదు ఆరోగ్య ప‌రంగా చియా సీడ్స్ అనేక‌ ప్రయోజనాలను చేకూరుస్తాయి.అలాగే అందాన్ని పెంచడానికి సైతం చియా సీడ్స్ ఉపయోగపడతాయి.

ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే విధంగా చియా సీడ్స్ ను ఉపయోగిస్తే మీ ముఖ చర్మం వైట్ గా, బ్రైట్ గా మరియు టైట్ గా మారుతుంది.అందుకోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు చియా సీడ్స్ వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత ఒక‌ బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు చియా సీడ్స్ వేసుకోవాలి.అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ శనగపిండి,( Besan Flour ) హాఫ్‌ టేబుల్ స్పూన్ చందనం పొడి,( Chandanam ) హాఫ్ టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్, చిటికెడు హల్ది పౌడర్ వేసుకోవాలి.

Telugu Tips, Skin, Chia Seeds, Chiaseeds, Latest, Skin Care, Skin Care Tips-Telu

చివ‌రిగా వన్ టేబుల్ తేనె ( Honey ) మరియు సరిపడా రోజ్ వాటర్( Rose Water ) వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని ఇర‌వై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వేళ్ళతో సున్నితంగా చర్మాన్ని రబ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.

Telugu Tips, Skin, Chia Seeds, Chiaseeds, Latest, Skin Care, Skin Care Tips-Telu

రోజుకి ఒక్కసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే కొద్ది రోజుల్లోనే మీ చర్మం తెల్లగా మారుతుంది.చర్మంపై ముడతలు చారలు వంటివి ఏమైనా ఉంటే మాయం అవుతాయి.స్కిన్ టైట్ గా, బ్రైట్ గా మారుతుంది.

మొండి మచ్చలు సైతం క్రమంగా తగ్గుముఖం పడతాయి.కాబట్టి యవ్వనమైన మెరిసే మచ్చలేని తెల్లటి ముఖ చర్మాన్ని కోరుకునేవారు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube