ఇండియాలోని వెజిటేబుల్ పిజ్జా, బర్గర్ల లవర్స్‌కి మెక్‌డొనాల్డ్స్( McDonalds ) షాక్ ఇచ్చింది.ఈ ఆహారాలలో టమాటా ముక్కలను( Tomatoes ) కొద్ది రోజులు పాటు అందించబోమని ఈ కంపెనీ రెస్టారెంట్లు ప్రకటించాయి.
ముఖ్యంగా తమ పిజ్జా, బర్గర్లు, సలాడ్లు, ర్యాప్‌లలో టమాటాలను ఉపయోగించడం మానేశామని రెస్టారెంట్ల ముందు నోటీసులు అతికిస్తున్నాయి.దీనికి కారణం ఇప్పుడు వాటికి సరిపడా టమాటాలు అందుబాటులో లేవు.
టమాటా ధరలు( Tomatoes Price ) విపరీతంగా పెరిగిపోవడం, సరఫరా తగ్గిపోవడం వల్ల మెక్‌డొనాల్డ్స్ వీటిని పెద్దగా కొనుగోలు చేయలేకపోతోంది.
అలాగే ప్రస్తుతం మార్కెట్‌లో దొరికే టమాటాలు కంపెనీ నాణ్యత ప్రమాణాలకు( Quality Concerns ) అనుగుణంగా లేవని, అందుకే వాటిని ఎక్కువగా కొనుగోలు చేయలేకపోతున్నామని మెక్‌డొనాల్డ్స్ చెబుతోంది.
ఉత్తర, తూర్పు భారతదేశంలో మెక్‌డొనాల్డ్స్‌ని నడుపుతున్న కంపెనీ సీజన్‌కు సంబంధించిన తాత్కాలిక సమస్యల కారణంగా టమాటలు తీసివేయాల్సి వచ్చిందని తెలిపింది.

“కంపెనీ ప్రస్తుతం కొన్ని తాత్కాలిక సరఫరా సమస్యలు ఎదుర్కొంటోంది.సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించడానికి మా సరఫరాదారులతో కలిసి పని చేస్తోంది” అని కంపెనీ తాజా ప్రకటన పేర్కొంది.“మా కస్టమర్లకు అత్యంత నాణ్యమైన ఉత్పత్తులు, సేవలను అందించడానికి కంపెనీ కట్టుబడి ఉంది.పరిస్థితిని పర్యవేక్షించడం, అవసరమైన విధంగా సర్దుబాట్లు చేయడం కొనసాగిస్తాం.” అని కూడా ప్రకటన పేర్కొంది.

అయితే పశ్చిమ, దక్షిణ భారతదేశంలోని మెక్‌డొనాల్డ్స్‌ను నడుపుతున్న కంపెనీ తమ దుకాణాలలో తక్కువ సంఖ్యలో మాత్రమే ప్రభావితమవుతాయని పేర్కొంది.భారీ వర్షాలు, అధిక ఉష్ణోగ్రతలతో టమాటాలు పండించడానికి వాతావరణం ప్రతికూలంగా ఉన్నందున అధిక ధరలు ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది.దీంతో ఈ ఏడాది టమాటా ధరలు కిలో రూ.160 వరకు భారీగా పెరిగాయి.ప్రస్తుతం కొండెక్కిన వీటి ధరలు త్వరలో దిగిరానున్నాయి.







