స్టార్ హీరోయిన్ సమంత( Samantha ) దాదాపు ఏడాది పాటు సినిమా లకు బ్రేక్ తీసుకోబోతుంది అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.పెద్ద ఎత్తున ఈ విషయమై చర్చ జరుగుతోంది.
సిటాడెల్ సిరీస్ ఇంకా ఖుషి సినిమాల షూటింగ్స్ ను ముగించిందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఆ షూటింగ్స్ ముగించిన తర్వాత మాతమ్ర సమంత బ్రేక్ తీసుకుంటుందని కొందరు అంటున్నారు.
ఈ రెండు కూడా గత ఏడాది లోనే పూర్తి అవ్వాల్సి ఉంది.కానీ సమంత మయో సైటిస్ అనారోగ్య సమస్యల కారణంగా వాయిదా పడుతూ వస్తున్నాయి.

ఎట్టకేలకు ఖుషి సినిమా( Kushi Movie ) షూటింగ్ ను ముగించామని యూనిట్ సభ్యుల ద్వారా అనధికారికంగా సమాచారం అందుతోంది.ఇదే సమయంలో బాలీవుడ్ వర్గాల నుండి సిటాడెల్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలు అయ్యిందని వార్తలు వస్తున్నాయి.అంటే అక్కడ కూడా షూటింగ్ పూర్తి అయ్యింది.ఇప్పుడు అసలు విషయం ఏంటి అంటే ఖుషి మరియు సిటాడెల్( Citadel ) ప్రమోషన్ లకు సమంత వస్తుందా లేదంటే స్కిప్ చేస్తుందా అనేది చూడాలి.
ఆ మధ్య యశోద సినిమా( Yashoda Movie ) కు కనీసం నిల్చోలేని పరిస్థితుల్లో సమంత ప్రమోషన్స్ కు వచ్చింది.కనుక ఈ రెండు ప్రాజెక్ట్ ల ప్రమోషన్ వ్యవహారం దగ్గరుండి మరీ చూసుకుంటుందని… ఆమె కనీసం వారం వారం చొప్పున కేటాయిస్తుందనే వార్తలు వస్తున్నాయి.

అన్ని అనుకున్నట్లుగా జరిగితే కచ్చితంగా ఈ రెండు ప్రాజెక్ట్ లు భారీ విజయాలను సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యంగా విజయ్ దేవరకొండ( Vijay Deverakonda ) తో నటిస్తున్న ఖుషి సినిమా ఓ రేంజ్ లో కుమ్మేయడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.విజయ్ దేవరకొండ… సమంత ల యొక్క కాంబో హిట్ కాంబో అని గతంలో నిరూపితం అయ్యింది.కనుక ఖుషి సినిమా హిట్ అవ్వడం పక్కా.







