టీడీపీ నేత నారా లోకేశ్, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో లోకేశ్ చేసిన వ్యాఖ్యలకు అనిల్ కుమార్ కౌంటర్ ఇచ్చారు.
తనపై టీడీపీ అసత్య ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు.భూములు కబ్జా అంటూ లోకేశ్ ఆరోపిస్తున్నారన్న ఆయన లోకేశ్ కు పరిపక్వత లేదని విమర్శించారు.
తనకు సంబంధం లేని భూములను అంటకడుతున్నారని చెప్పారు.రాజకీయంగా ఎదుర్కొలేకనే తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.







