కాజల్ తన కొడుకుకు నీల్ అని పేరు పెట్టడం వెనుక ఇంత కథ ఉందా?

వెండితెర చందమామ కాజల్ అగర్వాల్( Kajal Aggarwal ) ప్రస్తుతం ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా ఈమె ప్రస్తుతం ఇండియన్ 2( Indian 2 ) సినిమాతోపాటు బాలకృష్ణ ( Balakrishna ) అనిల్ రావిపూడి ( Anil Ravipudi ) కాంబినేషన్లో వస్తున్న భగవంత్ కేసరి ( Bhagavanth Kesari ) సినిమాలో కూడా నటిస్తున్నారు.

 Is There A Story Behind Kajal Naming ,kajal Aggarwal ,indian 2, Balakrishna,-TeluguStop.com

దీనితోపాటు సత్యభామ అనే లేడీ ఓరియంటెడ్ మూవీ ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి కాజల్ అగర్వాల్ సిద్ధమయ్యారు.ఇలా కెరియర్ పరంగా కాజల్ అగర్వాల్ ఎంతో బిజీగా ఉన్నారు అలాగే వ్యక్తిగత జీవితంలో కూడా ఈమె ఎంతో సంతోషంగా ఉన్నారు.

Telugu Anil Ravipudi, Balakrishna, Indian, Kajal Aggarwal, Neil Kitchlu, Tollywo

కాజల్ అగర్వాల్ 2020 అక్టోబర్ నెలలో తన చిన్ననాటి స్నేహితుడు అయినటువంటి గౌతమ్ కిచ్లు ( Gautham Kitchlu ) అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు.ఇలా పెళ్లయిన వెంటనే ఈమె ప్రెగ్నెంట్ కావడంతో ఇండస్ట్రీకి కొంతకాలం పాటు విరామం ఇచ్చారు.ఇక కాజాల్ అగర్వాల్ మగ బిడ్డకు జన్మనిచ్చారు.ప్రస్తుతం బాబుకు ఏడాదిన్నర వయసు ఉంది తన కుమారుడికి నీల్ కిచ్లు( Neil Kitchlu ) అనే నామకరణం చేశారు.

అయితే తన కుమారుడికి నీల్ అనే పేరు పెట్టడం వెనుక ఉన్నటువంటి కారణాన్ని తాజాగా కాజల్ అగర్వాల్ తెలియచేశారు.

Telugu Anil Ravipudi, Balakrishna, Indian, Kajal Aggarwal, Neil Kitchlu, Tollywo

తన కుమారుడికి నీల్ అనే పేరు పెట్టడానికి కారణం ఉందని ఈమె తెలిపారు తనకు పరమేశ్వరుడు( Lord Shiva ) అంటే చాలా ఇష్టం.అందుకే ఆ నీలకంటేశ్వరుని పేరులో మొదటి రెండక్షరాలు వచ్చేలా నీల్ అని తన కొడుక్కి పేరు పెట్టామని.బిడ్డ పుట్టాక అందరూ పిలవడానికి సులువుగా ఉండే పేరు, రాయడానికి సులువుగా ఉండే పేరు పెడదామని తన భర్తకి చెప్పానని,అందుకే ఈ పేరు ఎంపిక చేసుకున్నాము అంటూ తన కుమారుడు పేరు వెనుక ఉన్నటువంటి స్టోరీని కాజల్ అగర్వాల్ రివీల్ చేశారు.

ప్రస్తుతం కాజల్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube