తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న దిల్ రాజు( Dil Raju ) రెండవ భార్య కుమారుడి మొదటి పుట్టినరోజు వేడుకలను ఎంతో అంగరంగ వైభవంగా జరిపిన విషయం మనకు తెలిసిందే.అయితే తాజాగా దిల్ రాజు తన కుమారుడికి పుట్టిన రోజు వేడుకలకు( Birthday Celebrations ) సంబంధించిన వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.దిల్ రాజు మొదటి భార్య అనిత(Anitha) మరణించడంతో ఈయన వైగారెడ్డి(Vyga Reddy) అనే అమ్మాయిని రెండో వివాహం చేసుకున్నారు.
ఈ దంపతులకు ఓ బాబు జన్మించగా ఆ అబ్బాయికి అన్వయ్ రెడ్డి( Anvay Reddy ) అని తన ఇద్దరి భార్యల పేర్లు కలిసి వచ్చేలా దిల్ రాజు నామకరణం చేశారు.

ఇక తన కుమారుడికి ఏడాది పూర్తి కావడంతో సినీ సెలబ్రిటీలు అందరిని ఆహ్వానించి ఎంతో ఘనంగా పుట్టిన రోజు వేడుకను నిర్వహించిన సంగతి తెలిసిందే.అయితే తన బర్తడే కి సంబంధించిన వీడియోని దిల్ రాజు దంపతులు షేర్ చేశారు.తన కుమారుడు అన్వాయ్ పుట్టినరోజు సందర్భంగా ముందుగా ఒక ప్రత్యేక వీడియో సాంగ్ ని దిల్ రాజు రిలీజ్ చేశాడు.
ఆ వీడియోలో దిల్ రాజు మరియు కుటుంబ సభ్యులు.అన్వయ్ ని ముద్దాడుతూ కనిపిస్తున్నారు.ఈ సాంగ్ కి థమన్( Thamman ) సంగీతం అందించగా కార్తీక్ ( Karthik ) పాడాడు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇందులో దిల్ రాజు ఆయన భార్య చిన్నపిల్లలుగా మారిపోయి తన కొడుకును ఆడిస్తున్నారు.కుటుంబ సభ్యులందరూ కూడా చిన్నారితో ఆడుకుంటూ ఎంతో ఎంజాయ్ చేశారు.
చిన్నారి కూడా కేక్ స్మాష్ చేస్తూ ఆటపాటలతో ఎంతో ఎంజాయ్ చేశారని తెలుస్తుంది.ప్రస్తుతం ఈ చిన్నారికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక దిల్ రాజు కుమారుడు పుట్టినరోజు వేడుకలలో భాగంగా టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలు అందరూ కూడా తరలివచ్చిన విషయం మనకు తెలుస్తుంది.