నిహారిక( Niharika ) జొన్నలగడ్డ వెంకట చైతన్య ( Venkata Chaitanya ) వీరిద్దరూ పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా 2020 డిసెంబర్ 9వ తేదీ వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే.ఇలా పెళ్లయిన రెండు సంవత్సరాలకి ఈ జంట విడాకులు( Divorce ) తీసుకొని విడిపోబోతున్నారు.
ఇక వీరి విడాకుల విషయం కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా వీరిద్దరూ విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది.విడాకుల వార్తలుసోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు ఈ వ్యవహారం తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు.
ఇకపోతే విడాకుల వార్తలు అధికారకంగా వెలువడిన సమయంలో నిహారిక సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే నిహారిక తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.అయితే ఈమె విడాకులు వార్తలు సోషల్ మీడియాలో అధికారకంగా వెలువడిన తర్వాత సోషల్ మీడియా వేదికగా నిహారిక స్పందిస్తూ చేసిన పోస్ట్ వైరల్ అయింది.ఇంతకీ ఈమె ఎలాంటి పోస్ట్ చేశారనే విషయానికి వస్తే… నిహారిక సోషల్ మీడియా వేదికగా తన స్నేహితురాలు అయినటువంటి నిహారిక ఎన్ ఎం( Niharika NM ) కిపుట్టినరోజు శుభాకాంక్షలు( Birthday Wishes ) తెలియజేస్తూ తనతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేశారు.

ఇన్ఫ్లుయెన్సర్ నిహారిక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటమే కాకుండా పలు సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహించారు.ఇక వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడటంతో తరచూ సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఉంటారు.ఈ క్రమంలోని ఈమె పుట్టినరోజు సందర్భంగా నిహారిక తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్ట్ చేశారు.దీంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.ఒకవైపు విడాకుల వార్తలు వైరల్ అవుతున్న తరుణంలో నిహారిక వాటి గురించి స్పందించకుండా ఇలా తన స్నేహితురాలికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.అయితే ఈమె వ్యవహార శైలి చూస్తుంటే తన విడాకుల విషయాని పూర్తిగా లైట్ తీసుకున్నారని తెలుస్తుంది.







