ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన 'స్పై'.. 5 రోజుల్లో రాబట్టింది ఎంతంటే?

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్( Hero Nikhil Siddharth ) కెరీర్ ఇప్పుడు ఏ యంగ్ హీరో కెరీర్ సాగనంత ఫాస్ట్ గా సాగిపోతుంది.ఈ హీరో హ్యాపీడేస్ తో మొదలైన ప్రయాణం ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకునే వరకు వచ్చింది.

 Nikhil Siddhartha's Spy 5 Days Collections At Box Office, Nikhil Siddharth, Spy-TeluguStop.com

నిఖిల్ సిద్ధార్థ్ రెండు సూపర్ హిట్స్ తర్వాత హ్యాట్రిక్ హిట్ అందుకోవాలని చూస్తున్న తరుణంలో ఆయన నుండి వచ్చిన మూవీ ‘స్పై’.

Telugu Aryan Rajesh, Garry Bh, Iswarya Menon, Spy Days, Spy-Movie

ఈ సినిమాను మరికొంత కాలం ఆగిన తర్వాత రిలీజ్ చేయాలని నిఖిల్ ఆలోచన.ఎందుకంటే స్పై సినిమా( Spy Movie )ను బాగా ప్రమోట్ చేసి రిలీజ్ చేస్తే కలెక్షన్స్ బాగా వస్తాయి.హ్యాట్రిక్ విజయం అందుకోవచ్చు.

కానీ ఈయన అనుకున్నది కుదరక నిర్మాత కారణంగా జూన్ 29నే రిలీజ్ చేసారు.దీంతో ఈ సినిమా ముందే అనౌన్స్ చేసిన సమయానికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

నిఖిల్, ఐశ్వర్య మీనన్( Iswarya Menon ) నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా థ్రిల్లర్ మూవీ ”స్పై”.యాక్షన్ థ్రిల్లర్ గా బీహెచ్ గ్యారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై బాగానే అంచనాలు క్రియేట్ అయ్యాయి.

మొదటి షో తోనే మంచి టాక్ రావడంతో ఈ సినిమా ఓపెనింగ్స్ కుమ్మేసింది.నిఖిల్ స్పై మూవీ మొదటి రోజు 11.7 కోట్ల గ్రాస్( Spy Movie First Day Collections ) ను రాబట్టి నిఖిల్ క్రేజ్ ను నిరూపించింది.

Telugu Aryan Rajesh, Garry Bh, Iswarya Menon, Spy Days, Spy-Movie

ఇక ఈ సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకోగా బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో అని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్న సమయంలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యింది అంటూ టాక్ వస్తుంది.పీఆర్ లెక్కల ప్రకారం ఈ సినిమా 5 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా 28.90 కోట్ల రూపాయల గ్రాస్( 28 Crore Rupees ) వసూళ్లు రాబట్టింది.దీంతో బ్రేక్ ఈవెన్ సాధించింది అని అంటున్నారు.అంతేకాదు నిఖిల్ ఫాస్టేస్ట్ బ్రేక్ ఈవెన్ మూవీ కూడా ఇదే కావడం విశేషం.

మొత్తానికి లాస్ట్ మినిట్ లో రిలీజ్ అయిన కూడా నిఖిల్ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యింది.మరి లాంగ్ రన్ లో ఈ మూవీ ఎన్ని కలెక్షన్స్ రాబడుతుందో వేచి చూడాలి.

ఇక ఇడి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కే రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించడమే కాకుండా కథ కూడా అందించారు.చరణ్ శ్రీపాక సంగీతం అందించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube