కేంద్ర అధికార పార్టీ తమ రాష్ట్ర అధ్యక్షులు మార్పుకు శ్రీకారం చుట్టింది.తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ తో పాటు మరో మూడు రాష్ట్రాల్లో కూడా అధ్యక్షులను మార్చి కొత్త అధ్యక్షులను నియమించింది.
సాధారణ సంస్థాగత మార్పులలో భాగంగానే అధ్యక్షులను మార్చామని, సామాన్య కార్యకర్తలకు సైతం అధికారం అందేలా చేయడం మా పార్టీ పాలసీ అని, నాయకుల కన్నా పార్టీ గొప్పదనే సంకేతాలు ఇవ్వడం కోసమే ఈ రొటేషన్ పద్దతి అవలంబిస్తామని కమలనాధులు చెప్పుకుంటున్నారు.అయితే అధ్యక్షులు మార్పు భాజపాకు( BJP ) భూమరాంగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్న విశ్లేషణలు కూడా వస్తున్నాయి.
ముఖ్యంగా తెలంగాణలో భాజపాను క్రియాశీలక పాత్ర పోషించే విధంగా ముందుకు నడిపించిన బండి సంజయ్ ని( Bandi Sanjay ) మార్చడం ఆయన అభిమానులకు మరియు మెజారిటీ బిజెపి కార్యకర్తలకు నచ్చలేదని టాక్ వినిపిస్తుంది.అందుకనుగుణంగా సోషల్ మీడియా వేదికగా అనేకమంది బండికి మద్దతుగా పోస్టులు పెట్టడం గమనార్హం.
కేసీఆర్ను( KCR ) ఢీకొట్టడానికి ఎంతకైనా సిద్ధమైన బండి ని మార్చడం ద్వారా కార్యకర్తలకు పార్టీ తప్పుడు సంకేతాలు ఇస్తున్నట్లు అవుతుందని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.మరోవైపు ఆంధ్రప్రదేశ్లో బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు( Somu Veerraju ) మార్పుపై మాత్రం ఎటువంటి ప్రతిస్పందన లేకపోవడం గమనార్హం .

ఆయన మొదటి నుంచి అధికార వైసీపీకి అనుకూలంగా ఉండి బాజాపా ఎదుగుదలకు పెద్దగా ప్రయత్నించలేదన్న వాదన ఉంది .చంద్రబాబును మొదటి నుంచి వ్యతిరేకించే సోము వీర్రాజు, మిత్రపక్షం జనసేనకు కూడా సరైన విధంగా మద్దతు ఇవ్వలేదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కూడా లోగడ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.మిగతా అభ్యర్థుల మార్పులలో ఎటువంటి ఇబ్బంది లేకపోయినా బండి సంజయ్ విషయంలో మాత్రం కార్యకర్తల నుంచి ప్రతిస్పందన గట్టిగా వస్తున్నట్లు తెలుస్తుంది.

మరి ఆయనను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారన్న వార్తలు నిజమైతే మాత్రం బండి సంజయ్ అనుసర వర్గం కొంత సంతృప్తి చెందే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.మరి బండి రాజకీయ భవిష్యత్తుపై కేంద్ర అధిష్టానం ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.అధ్యక్ష పదవి నుంచి తొలగించడం పై హుందా గా స్పందించిన బండి సంజయ్ తనలాంటి సామాన్య కార్యకర్త కు ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన కేంద్ర పెద్దలకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు.







