షర్మిల ముందు అదొక్కటే దారి..?

ఈ మద్య తెలంగాణ రాజకీయాల్లో వైఎస్ షర్మిల( Y.S.Sharmila )పేరు తరచూ వినిపిస్తూనే ఉంది.తాను తెలంగాణ బిడ్డనే అంటూ తెలంగాణ రాజకీయాల్లో మార్పు కోసం వైఎస్ఆర్ తెలంగాణ పేరుతో కొత్త పార్టీ పెట్టి రాష్ట్ర రాజకీయాల్లో కీలకం అవుదామనుకున్నారు.

 What Will Ys Sharmila Do Next, Ys Jagan Mohan Reddy, Ys Sharmila , Ts Politics-TeluguStop.com

కానీ షర్మిల ప్రణాళికలు ఏ మాత్రం సక్సస్ కాలేదు.పార్టీ అయితే స్థాపించింది గాని.ఆ పార్టీకి రాష్ట్రంలో ఏమాత్రం మైలేజ్ రావడం లేదు.వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డగా తెలంగాణ ప్రజల్లో సింపతీ సంపాదించుకోవలని చూసిన రాష్ట్ర ప్రజలు షర్మిలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.

Telugu Congress, Telangana, Ysjagan, Ys Sharmila, Ysr Congress-Politics

ఎందుకంటే ఏపీ లో తన అన్న జగన్( YS Jagan Mohan Reddy ) తో విభేదాల కారణంగానే ఆమె తెలంగాణలో పార్టీ పెట్టారనే భావన ప్రజల్లో ఉండడంతో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి రావాల్సిన మైలేజ్ రావడంతో.ఇక మరోవైపు ఎన్నికలు కూడా దగ్గర పడుతుండడంతో పార్టీ సంస్థాగతంగా బలపడకపోతే షర్మిల రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుంది.అందుకే ఆమె తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ విషయాన్ని ఇప్పటికే పలువురు హస్తం నేతలు కన్ఫర్మ్ చేశారు కూడా.

అయితే షర్మిలను కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు హైకమాండ్ సిద్దంగానే ఉన్నప్పటికి.తెలంగాణ కంటే ఏపీలోనే షర్మిల సేవలు ఉపయోగించుకోవాలని హైకమాండ్ ఆలోచిస్తుండట.

Telugu Congress, Telangana, Ysjagan, Ys Sharmila, Ysr Congress-Politics

ప్రస్తుతం టి కాంగ్రెస్ లో బలమైన నేతలకు కొదువే లేదు.ఇప్పటికే పదవుల విషయంలో నేతలమద్య నిత్యం విభేదాలు రగులుకుంటూనే ఉన్నాయి.ఈ నేపథ్యంలో షర్మిలను టి కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తే కొత్త సమస్యలు తప్పవని భయం హైకమాండ్ ను వెంటాడుతోందట.అయితే షర్మిల నేమో టి కాంగ్రెస్ లో చేరడానికి సిద్దంగా ఉన్న.

ఏపీలో కాంగ్రెస్ తరుపున బరిలో దిగేందుకు ఏ మాత్రం సిద్దంగా లేదని తెలుస్తోంది.దాంతో షర్మిల ఎటు తేల్చుకోలేని సందిగ్ధంలో ఉండిపోయినట్లు తెలుస్తోంది.

మొత్తానికి రాజకీయంగా తెలంగాణలో స్థిరపడలంటే కాంగ్రెస్ లో చేరడం తప్పా షర్మిలకు వేరే దారి కనిపించడం లేదనేది కొందరి అభిప్రాయం.మరి షర్మిల అడుగులు ఎటు పడతాయో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube