Yukti Thareja : అల్లు అర్జున్ అంటే నాకు పిచ్చి.. రంగబలి హీరోయిన్ కామెంట్స్ వైరల్?

పవన్ బాసం శెట్టి దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా నటించిన తాజా చిత్రం రంగబలి( Rangabali ).ఈ సినిమాలో కొత్త హీరోయిన్ యుక్తి తరేజ హీరోయిన్ గా నటించింది.

 Allu Arjun Is My Favourite Hero Says Rangabali Heroine Yukti Thareja-TeluguStop.com

ఈ సినిమాతోనే ఈ ముద్దుగుమ్మ పరిచయం కాబోతోంది.ఇప్పటికే ఈ మూవీ ముంచి వదిలిన ట్రైలర్ లో ఈ ముద్దుగుమ్మ నటనతో అదరగొట్టడంతో పాటు అందంతో బాగానే గుర్తింపు తెచ్చుకుంది.

ట్రైలర్‌కు కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.సినిమాపై హీరో నాగశౌర్య చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.

ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బల్లగుద్ది మరీ చెప్పారు నాగశౌర్య.

Telugu Allu Arjun, Anushka, Naga Shaurya, Rangabali, Tollywood, Yukti Thareja-Mo

ఎస్ఎల్‌వి సినిమాపై బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ఈనెల 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ నేపథ్యంలో హీరోయిన్ యుక్తి తరేజ( Yukti Thareja ) మీడియాలో మాట్లాడారు.ఈ సందర్భంగా యుక్తి తరేజ మాట్లాడుతూ.

నేను నా మొదటి సినిమానే నాగశౌర్య లాంటి గొప్ప హీరోతో కలిసి పనిచేయడం నా అదృష్టం.దర్శకుడు పవన్ ఈ సినిమాలోని హీరోయిన్ పాత్ర కోసం ఆడిషన్స్ చేయగా మొదట్లో లుక్ టెస్ట్ జరిగింది.

ఆ తర్వాత రెండు సన్నివేశాలు ఇచ్చి నటించమని చెప్పారు.ఈ పాత్రకు నేను సరిపోతానని నమ్మకం కుదిరిన తర్వాతే ఎంపిక చేశారు.

Telugu Allu Arjun, Anushka, Naga Shaurya, Rangabali, Tollywood, Yukti Thareja-Mo

ఇది నా మొదటి తెలుగు సినిమా.నా మొదటి సినిమాకే నాగశౌర్య( Naga Shaurya )తో పాటు మంచి నిర్మాణ సంస్థలో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను.ఈ సినిమా నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను అని చెప్పుకొచ్చింది తరేజ.అలాగే తెలుగులో తన ఫేవరేట్ హీరో అల్లు అర్జున్ అని యుక్తి తరేజ తెలిపింది.

అల్లు అర్జున్ డాన్స్ అంటే తనకు చాలా ఇష్టమని, ఆయన డాన్స్‌ను మ్యాచ్ చేయడం చాలా కష్టమని అన్నారు.అయితే, బన్నీతో కలిసి డాన్స్ చేయాలని ఉందని తన మనసులో మాట బయట పెట్టింది.

హీరోయిన్స్‌ లో అనుష్క శెట్టి అంటే నాకు చాలా ఇష్టం అని తెలిపారు.మరి ఈ సినిమా ఈ ముద్దుగుమ్మకు ఏ మేరకు సక్సెస్ ను తెచ్చి పెడుతుందో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube