టాలీవుడ్ హీరో నాగశౌర్య( Naga Shaurya ) తాజాగా నటించిన చిత్రం రంగబలి.( Rangabali ) పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యుక్తి తరేజ హీరోయిన్ గా నటించింది.
ఈ సినిమా జులై 7 న ప్రేక్షకుల ముందుకు రానుంది.కాగా ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నలుగు నెలకొన్నాయి.
ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని నాగశౌర్య అభిమానులు ఎంతో ఆతృతంగా ఎదురుచూస్తున్నారు.ప్రస్తుతం చిత్ర బృందం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.
ఈ ప్రమోషన్స్ లో భాగంగానే తాజాగా ఒక ప్రెస్ మీట్ లో పాల్గొన్న హీరో నాగశౌర్య పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా నాగశౌర్య మాట్లాడుతూ.నేను హీరోగా నటించిన ఒక సినిమా ఘోర పరాజయం అందుకుంది.ఆ సినిమా కోసం ఎంతో శ్రమించాను.
శారీరకంగా లుక్‌లో మార్పులు చేసుకున్నాను.కథ చెప్పినప్పుడు భారీ సెట్స్, ప్రముఖ నటీనటులతో ఈ సినిమా ఉంటుందని చెప్పారు.
తీరా సెట్స్‌లోకి అడుగుపెట్టాక అక్కడి పరిస్థితులు వేరుగా ఉన్నాయి.ఇలా అయితే సినిమా ఆడదు.
మీకు ఒకవేళ ఫ్లాప్ సినిమా( Flop Movie ) చేయాలని ఉంటే తప్పకుండా చేద్దాం.కాకపోతే, ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాను.
దీనిపై ఎన్నో నమ్మకాలు పెట్టుకున్నా అదొక్కటే బాధగా ఉంది అని నిర్మాతకు చెప్పేశాను.

నేను నటించిన ఎన్నో సినిమాలకు వేరే వ్యక్తులు సలహాలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి.సినిమా చిత్రీకరిస్తున్నప్పుడే ఇది బాలేదు అది బాలేదు.ఇలా మార్పులు చేస్తే సరిపోతుంది అని సూచనలు చేసేవారు.
వారి మాటలు కాదనలేక.నేను కూడా అన్నింటికీ ఓకే అనేవాడిని.
అలా, వచ్చిన పలు సినిమాలు అనుకున్నంత స్థాయిలో ఆడలేదు అని శౌర్య తెలిపారు.అనంతరం ఆయన తన సినిమాల విషయంలో సలహాలు ఇచ్చేవారికి నో చెప్పడం నేర్చుకున్నాను అని తెలిపారు…
.