ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ జన గర్జన సభలో( Congress Janagarjana ) రాహుల్ గాంధీ( Rahul Gandhi ) సంచలన వ్యాఖ్యలు చేశారు.కర్ణాటకలో బీజేపీ పార్టీని ఓడించినట్టు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని( BRS ) ఓడిస్తామని భీమా వ్యక్తం చేశారు.
అంతేకాదు బీజేపీ బీ టీమ్ బీఆర్ఎస్ అని సంచలన ఆరోపణలు చేశారు.తెలంగాణలో బీజేపీ బలహీన పడిందని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వృద్ధులకు, వితంతువులకు ₹4000 పెన్షన్ ఇస్తామని సంచల హామీ ప్రకటించారు.ఈ నిర్ణయం పేదల జీవితాల్లో మార్పు తీసుకొస్తుందని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో ఆదివాసీలకు పోడు భూములపై పూర్తి హక్కులు కల్పిస్తామని పేర్కొన్నారు.తెలంగాణలో పోటీ బీఆర్ఎస్.
కాంగ్రెస్ పార్టీల మధ్యే ఉందని రాహుల్ స్పష్టం చేశారు.
ఒకప్పుడు తెలంగాణలో ముక్కోణపు పోటీ ఉండేది.కానీ తెలంగాణలో బీజేపీ బండికి నాలుగు టైర్లు పంక్చర్ అయ్యాయి.కర్ణాటకలో ఎలాగైతే గెలిచామో… తెలంగాణలో కూడా అదే రీతిలో అధికారంలోకి వస్తామని రాహుల్ స్పష్టం చేశారు.
కేసీఆర్ 9ఏళ్ల పాలనలో తెలంగాణలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని మండిపడ్డారు.ఒకప్పుడు తెలంగాణ పేదలకు మరియు రైతులకు స్వప్నంలా ఉండేది.
బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ తన జాగీరు అనుకుంటున్నారని విమర్శించారు.ఇక ఇదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసిన సీఎల్పీ నేత బట్టి విక్రమార్కునీ రాహుల్ గాంధీ అభినందించారు.అనంతరం ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటిని రాహుల్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.ఏది ఏమైనా ఖమ్మం జనగర్జన సభలో నాలుగువేల పెన్షన్ ఇస్తామని రాహుల్ చేసిన ప్రకటన తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది.