స్టార్ హీరో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) 2024 ఎన్నికల నేపథ్యంలో ఇతర హీరోల అభిమానుల గొప్పదనం గురించి కూడా వెల్లడిస్తూ ఆ హీరోల అభిమానాన్ని పొందే ప్రయత్నం చేస్తున్నారు.పవన్ స్పీచ్ కు ప్రజల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే.
కొన్నేళ్ల క్రితం ప్రభాస్, పవన్ అభిమానుల మధ్య గొడవ జరగగా తాజాగా ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ ఆ గొడవకు సంబంధించిన విషయాలను వెల్లడించారు.
ప్రభాస్( Prabhas ) ఫ్యాన్స్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సారీ చెప్పారు.
గతంలో నా అభిమానులకు ప్రభాస్ అభిమానులకు ఒక పోస్టర్ విషయంలో గొడవ జరిగిందని ఒక పోస్టర్ చినిగితే గొడవ చేయకూడదని క్షమించి వదిలేయాలని చిన్న గొడవను పెద్దది చేసి చూడవద్దని చేతులెత్తి వేడుకుంటున్నానని పవన్ చెప్పుకొచ్చారు.పవన్ కామెంట్లతో ప్రభాస్ ఫ్యాన్స్ కూల్ అవుతారని ప్రభాస్ ఫ్యాన్స్ సపోర్ట్( Fan support ) చేస్తారని అందరూ భావించారు.

అయితే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఒక లేఖను సోషల్ మీడియాలో రిలీజ్ చేయగా ఆ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా ఉన్న ఆ లేఖ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.ప్రభాస్ మాత్రం వివాదాలకు దూరంగా ఉంటారనే సంగతి తెలిసిందే.ఆ లేఖలో పవన్ ఫ్యాన్స్ కు వ్యతిరేకంగా ప్రభాస్ ఫ్యాన్స్ ప్రధానంగా ప్రస్తావించడం గమనార్హం.

సలార్( Salar ) సినిమాతో కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తామని ప్రభాస్ ఫ్యాన్స్ పేర్కొన్నారు.ఈ లేఖలో రెబల్ స్టార్ కృష్ణంరాజు చెప్పిన విషయాలను సైతం ఈ విధంగా ప్రస్తావించారు.ఈ లేఖ పవన్ కళ్యాణ్ దృష్టికి వస్తే పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.ప్రభాస్ తర్వాత సినిమా ప్రాజెక్ట్ కే టైటిల్ తో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది.







