ఈ ప్రపంచంలో మనకి తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి.ఒక్కొ దేశంలో ఒక్కొలా నిబంధనలు అనేవి ఉంటాయి.
దీంతో వేరే దేశానికి వెళ్లినప్పుడు అక్కడి రూల్స్ గురించి ముందే తెలుసుకోవాలి.అవేమీ తెలుసుకోకుండా ఏదొక పని చేస్తే జరిమానా కట్టడం లేదా కేసులను ఎదుర్కొవడం, జైలుకు వెళ్లడం లాంటి ఇబ్బందులు వస్తాయి.
అయితే ఏదైనా టూర్ కి మనం వెళ్లేటప్పుడు బట్టలు, ఇతర వస్తువులతో కూడిన సూట్ కేస్‌ను తీసుకువెళతాం.అయితే ఈ టూరిస్ట్ ప్రదేశానికి వెళ్లేటప్పుడు మాత్రం ఎలాంటి సూట్ కేసులను తీసుకెళ్లకూడదు.
ఎందుకంటే అక్కడకు సూట్ కేసులను తీసుకెళ్లడమనేది నిషేధం.

ఒకవేళ సూట్ కేసులను తీసుకెళితే భారీగా జరిమానా విధిస్తారు.యూరప్ లోని క్రోయేషియాలో డబ్రోవ్నిక్( Dubrovnik in Croatia ) అనే అనే నగరం ఉంది.ఈ నగరంలో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి.
దీంతో ఇక్కడికి వేరే దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తారు.ఉదయాన్నే అందమైన సూర్యోదయాన్ని చూడాలనుకుంటే ఇక్కడ చూడవచ్చు.
దీంతో సూర్యోదయాన్ని చూసేందుకు చాలామంది ఇక్కడకు వస్తారు.అలాగే మధ్యయుగం నాటి ఇటుకలు, రాళ్లతో నిర్మించిన కట్టడాలు ఇక్కడ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.

చక్రాల సూట్ కేసులను ( Wheeled suit cases )రోడ్డుపై లాక్కెళ్తుంటే సౌండ్ లు వస్తున్నాయని కొంతమంది ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారట.సౌండ్ పొల్యూషన్ వస్తుందని వరుసగా కంప్లైంట్ లు ఇచ్చారు.దీంతో దీనిపై ప్రభుత్వం స్పందించింది.దీంతో ఈ పర్యాటక ప్రదేశంలో సూట్ కేసులపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.సూట్ కేసులను ఎవరూ తీసుకురావొద్దని సూచించింది.నిబంధనలు ఉల్లంఘిస్తే 380 డాలర్లు జరిమానా విధిస్తామని స్పష్టం చేసింది.అంటే ఇండియన్ కరెన్సీలో రూ.24 వేలు.దీంతో ఈ నగరానికి వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాల్సిందే.