'దేవర'తో ఎన్టీఆర్ సింగిల్ గా రాబోతున్నాడా.. సైడ్ ఇచ్చేసిన స్టార్ హీరోలు!

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్( Young Tiger NTR) టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”దేవర”.ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా గత ఏడాది రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ సాధించిన విషయం తెలిసిందే.

 Ntr Devara Movie Release In 2024 Summer, Koratala Shiva, Ntr, Janhvi Kapoor, 202-TeluguStop.com

ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ఇప్పుడు కొరటాల సినిమా చేస్తుండడంతో తారక్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఇక ఇది పాన్ ఇండియన్ సినిమా( Pan India Movie ) కావడంతో అన్ని ఇండస్ట్రీలోని నటీనటులను ఎంపిక చేస్తూ ఈ సినిమాపై హైప్ భారీగా పెంచుతున్నాడు.ఇక ఈ సినిమాను 2024 సమ్మర్ బరిలో అని ప్రకటించిన విషయం విదితమే.అయితే ఎప్పుడు సమ్మర్ బరిలో స్టార్ హీరోలు తమ సినిమాలను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటారు.

వచ్చే ఏడాది కూడా అలా రిలీజ్ అవుతాయేమో అని అనుకున్నారు.

కానీ తాజాగా సీన్ చూస్తుంటే అందరు సంక్రాంతి సీజన్( Sankranti Releases ) లోనే కుమ్మేయడానికి వస్తున్నట్టు అనిపిస్తుంది.

మహేష్, చిరంజీవి, రవితేజ, ప్రభాస్ సినిమాలు సంక్రాంతికి రిలీజ్ చేయనుండగా.అంతకంటే ముందే పవన్ డిసెంబర్ లో ఓజి సినిమా( OG Movie )తో వచ్చే అవకాశం ఉందని టాక్.

ఇక మిగిలింది రామ్ చరణ్, అల్లు అర్జున్.వీరు కూడా సమ్మర్ రేస్ లో కష్టమే అని అంటున్నారు.

ఇలా స్టార్ హీరోలంతా తారక్ వచ్చే సమయంలో సైడ్ అవ్వడంతో ఎన్టీఆర్ దేవర( Devara )తో సింగిల్ గా రాబోతున్నాడు.ఇదే నిజమైతే సమ్మర్ విన్నర్ ఏకైక హీరో ఎన్టీఆర్ మాత్రమే ఉంటాడు.ఇదిలా ఉండగా ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఫిక్స్ కాగా సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.కాగా యువసుధ ఆర్ట్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లపై నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube