అఫిషియల్ : సంక్రాంతి రేస్ లోకి 'హనుమాన్'.. పోటీ తట్టుకుంటాడా?

మన టాలీవుడ్ నుండి రాబోతున్న బిగ్గెస్ట్ విజువల్ అండ్ గ్రాఫిక్స్ కలిగిన సినిమాల్లో ”హనుమాన్” ( Hanu-Man ) ఒకటి.ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయిన విషయం తెలిసిందే.

 Official Hanuman Telugu Movie Release Date Locked, Hanu-man, Sankranthi 2024, Pr-TeluguStop.com

తక్కువ బడ్జెట్ అయినప్పటికీ ఈ సినిమాను గ్రాండ్ గా తెరకెక్కించడంలో ఈ సినిమాను ఆదిపురుష్ తో పోల్చుతూ ప్రేక్షకులు చేసిన ట్రోలింగ్ వల్ల ఈ సినిమా మరింత హైప్ తెచ్చుకుంది.దీంతో మేకర్స్ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ( Director Prashant Varma ) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ( Hero Teja Sajja ) హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తున్నారు.ఈ సినిమా నుండి వచ్చిన టీజర్ రిలీజ్ తో అంచనాలు భారీగా పెంచుకోగా పాన్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అయ్యింది.అందుకే గ్రాఫిక్స్ విషయంలో ఏ చిన్న మిస్టేక్ కూడా లేకుండా ప్రశాంత్ వర్మ మరింత డిటెయిల్ గా కేర్ తీసుకుంటున్నాడు.

ఇక ఈ సినిమా యూనివర్శల్ సబ్జెక్ట్ కావడంతో పాన్ వరల్డ్( Pan World ) లెవల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

గతంలో వాయిదా పడ్డ ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న తరుణంలో తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను అఫిషియల్ గా ప్రకటించారు.

ఈ సినిమా ఈ ఏడాది మొత్తమే లేకుండా వచ్చే ఏడాదికి షిఫ్ట్ అయ్యింది.2024 జనవరి 12న రిలీజ్ చేస్తున్నట్టు పోస్టర్ రిలీజ్ చేస్తూ క్లారిటీ ఇచ్చేసారు.మరి ఈసారి సంక్రాంతి ( Sankranthi 2024 ) రేసులో స్టార్ హీరోల సినిమాలు ఉండడం వల్ల ఈ ప్రాజెక్ట్ ఎలా తట్టుకుని నిలబడుతుందో వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube