ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్( Rakesh Master ) మరణించిన విషయం మనకు తెలిసిందే.అయితే ఈయన మరణించిన అనంతరం ఈయన పెద్దకర్మను హైదరాబాద్ లో నిర్వహించారు.
ఈ పెద్దకర్మ ( Pedda Karma ) కార్యక్రమంలో భాగంగా రాకేష్ మాస్టర్ శిష్యులైనటువంటి శేఖర్ మాస్టర్( Sekhar Master ) సత్య మాస్టర్( Satya Master ) సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా రాకేష్ మాస్టర్ కుటుంబ సభ్యులతో పాటు పలువురు కొరియోగ్రాఫర్లు హాజరయ్యారు.
ఇక మాస్టర్ పెద్దకర్మలో భాగంగా రాకేష్ మాస్టర్ మామయ్య ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు.

రాకేష్ మాస్టర్ మామయ్య ( భార్య తండ్రి) పెద్దకర్మ కార్యక్రమంలో మాట్లాడుతూ ఒకరోజు రాకేష్ నా వద్దకు వచ్చి తనకు ఒక ఖాళీ స్టాంప్ పేపర్ పై సంతకం చేసి నాకు ఒక ఛానల్ ఉంది ఆ చానల్లో నీకు ఎంత వాటా కావాలో తీసుకో.ఒకవేళ నేను మీ కన్నా ముందుగా పోతే నా కుటుంబ సభ్యులను అలాగే ఆ ఛానల్ ని కూడా నువ్వే తీసుకో అంటూ ఖాళీ స్టాంపు పేపర్ తనకు ఇచ్చారని తెలియజేశారు.అయితే రాకేష్ మాస్టర్ తనకన్నా ముందు చనిపోవడంతో ఒక్కసారిగా ఎమోషనల్ అయినటువంటి తన మామయ్య ( Uncle ) నాకు ఆస్తులు అవసరం లేదు అంటూ ఎమోషనల్ అయ్యారు.

ఇలా తన అల్లుడు మరణించిన తర్వాత తన ఛానల్ బాధ్యతలను అలాగే తన కుటుంబ బాధ్యతలను తాను చూసుకుంటాను కానీ ఆయన ఇచ్చే ఆస్తులు నాకు వద్దు అంటూ ఆస్తి కాగితాలను అక్కడే చింపి వేశారు.నాకు ఎలాంటి ఆస్తులు వద్దు మీరందరూ తనపై చూపించే ఈ అభిమానమే చాలు.ఇలా ఆయన కోసం ఇచ్చినటువంటి ఆస్తిని కూడా తన మామయ్య చింపేయడంతో అక్కడున్నటువంటి వారందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.ఇక ఈ పెద్ద కర్మ కార్యక్రమంలో భాగంగా రాకేష్ మాస్టర్ శిష్యులైనటువంటి శేఖర్ మాస్టర్ సత్య మాస్టర్ కూడా ఎమోషనల్ కామెంట్స్ చేశారు.







