మిల్కీ బ్యూటీ తమన్నా( Milky beauty Tamannaah ) హ్యాపీ డేస్ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకుండా దాదాపు పుష్కర కాలం పాటు స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది.ఇప్పటికి కూడా స్టార్ హీరోయిన్ గా తమన్నా దూసుకు పోతుంది అనడంలో సందేహం లేదు.
అయితే గతంతో పోల్చితే ఇప్పుడు తమన్నా కు స్టార్ హీరో లకు జోడీగా నటించే అవకాశాలు రావడం లేదు.అలాగే స్టార్ హీరోల సినిమా ల్లో ఈమెకు మంచి పాత్ర లు దక్కడం లేదు.
బాహుబలి సినిమా( Baahubali Movie ) తర్వాత పాన్ ఇండియా స్టార్ గా తమన్నా నిలుస్తుందని అంతా భావించారు.

కానీ మిల్కీ బ్యూటీ తమన్నా కెరీర్ అప్పటి నుండే డౌన్ ఫాల్ మొదలు అయ్యింది.ఆ సినిమా తో మిల్కీ బ్యూటీ తమన్నా యొక్క క్రేజ్ తగ్గింది అనడంలో సందేహం లేదు.అయితే చిన్న సినిమా ల్లో మరియు చిన్న సిరీస్ ల్లో ఈమెకు నటించే అవకాశాలు వస్తున్నాయి.
పెద్ద హీరోల సినిమా ల్లో ఐటం సాంగ్స్( Tamannaah Item Songs ) ను చేసే అవకాశాలు కూడా వస్తున్నాయి.అవకాశాలు తగ్గుతున్నా కొద్ది బోల్డ్ కంటెంట్ సినిమా లను మరియు సిరీస్ లను చేస్తూ ఉంది అంటూ ఈ అమ్మడి గురించి మొదటి నుండే వార్తలు వస్తున్నాయి.

తాజాగా మిల్కీ బ్యూటీ లస్ట్ స్టోరీస్ 2( Lust Stories 2 ) లో నటించింది.నెట్ ఫ్లిక్స్( netflix ) లో స్ట్రీమింగ్ అవుతున్న సదరు సిరీస్ లో మిల్కీ బ్యూటీ తమన్నా యొక్క అందాల ఆరబోత విశ్వరూపం చూపించింది.అంతే కాకుండా ఆకట్టుకునే ఫిజిక్ తో ఇంటిమేట్ సన్నివేశాల్లో కూడా కనిపించింది.మిల్కీ బ్యూటీని మరీ ఇలాంటి సన్నివేశాల్లో ఎప్పుడు కూడా చూడలేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
మొత్తానికి మిల్కీ బ్యూటీ తమన్నా యొక్క జోరు మామూలుగా లేదు.ఆమె అందాల ఆరబోత లస్ట్ స్టోరీస్ తర్వాత మరింతగా పెరుగుతుందని అంతా భావిస్తున్నారు.ఆ సిరీస్ తోనే ఆమె పాన్ ఇండియా స్థాయి లో బోల్డ్ బ్యూటీగా మరింతగా పాపులారిటీని సొంతం చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.