బక్రీద్ పండుగ( Bakrid festival ) సందర్భంగా గ్రూప్-4 పరీక్ష కేంద్రాల వద్ద పకడ్బందీగా బందోబస్త్ ఏర్పాటు చేయాలి.రాజన్న సిరిసిల్ల జిల్లా : రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉంటూ సమర్థవంతమైన సేవలు అందించే విధంగా పోలీస్ అధికారులు,సిబ్బంది కృషి చేయాలని అదే విదంగా గురువారం జరుగు బక్రీద్ పండుగ సందర్భంగా, జులై 01వ తేదీన జరుగే గ్రూప్-4 పరీక్ష కేంద్రాల వద్ద పకడ్బందీగా బందోబస్త్ ఏర్పాటు చేయాలని ఎస్పీ సూచించారు.జిల్లా పోలీస్ కార్యక్రమంలో పోలీస్ అధికారులతో ఏర్పాటు చేసిన నెలవారి సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ గతంలో నమోదు అయిన కేసులు, గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులు వాటిపై చేసిన దర్యాప్తు, విచారణ స్థితిగతులు అడిగారు.
పోలీస్ స్టేషన్ ల వారిగా పెండింగ్ కేసుల దర్యాప్తు లు, పురోగతి లు అడిగి తెలుసుకున్నారు.క్వాలిటీ ఆఫ్ ఇన్విస్టిగేషన్, ప్లాన్ ఆఫ్ యాక్షన్ దర్యాప్తు లో ఉండాలని నేరస్తుల కు చట్ట ప్రకారం పడే శిక్ష తప్పించుకోకుండ రికార్డుల నిర్వహణ, సాక్ష్యాధారాల సేకరణ ఉండాలిని అన్నారు.
పెండింగ్ నాన్ బెయిలబుల్ వారెంట్లను త్వరగా ఎగ్జిక్యూట్ చేయడం వల్ల కేసుల విచారణ విజయవంతంగా పూర్తి అయి సకాలంలో బాధితులకు న్యాయం జరుగుటకు ఆస్కారం వుంటుందని నాన్బెలబుల్ వారెంట్స్ సంబంధిత వ్యక్తులకు జరిచేయడంలో ఎలాంటి జాప్యం కానీ నిర్లక్ష్యంగా వ్యహరించకుండ చూసుకోవాలని అన్నారు.గ్రామాలను అధికారులు విలేజ్ పోలీస్ ఆఫీసర్స్ సందర్శిస్తూ ప్రజలతో మమేకమౌతూ వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించే విధంగా కృషి చేయాలని తెలిపారు.
నేరాలు చేసేవారిని, నేర స్వభావం కలిగిన వ్యక్తులను పోలీస్ స్టేషన్ ల వారిగా గుర్తించి బైండోవర్ చేయాలని అధికారులను ఆదేశించారు.పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీషీటర్ల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని అన్నారు.
చట్టవ్యతిరేక కార్యక్రమాలైన గంజాయి,పేకాట,గుడుంబా మొదలగు వాటిపై ప్రత్యేక దృష్టి సారించి వాటి నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.వివిధ సమస్యల్లో ఇరు వర్గాల మధ్య మధ్యవర్తిత్వం చేస్తూ సమస్యలు పరిష్కరిస్తామని ఇరు వర్గాల వద్ద డబ్బులు వసూలు చేసే వారిపై ఫిర్యాదులు వస్తే వారి పట్ల చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
గురువారం రోజున జరుగు బక్రీద్,తొలి ఏకాదశి పండుగల సందర్భంగా జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రత చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు.జులై 01 వ తేది శనివారం రోజున జరుగు గ్రూప్-4 నియామక పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్త్ ఏర్పాటు చేయాలని,పరీక్ష కేంద్రాల 144 సెక్షన్ అమలు2 చేస్తూ ప్రత్యేక పోలీస్ నిఘా ఏర్పాటు చేసి అవచనియా సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.
గత నెలలో విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ ప్రజలకు సమర్ధవంతమైన సేవలందించిన 28 అధికారులకు, సిబ్బందికి ప్రశంశ పత్రాలు అందజేసి అభినందించారు.తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పోలీస్ శాఖ నిర్వహించిన సురక్ష దినోత్సవం, తెలంగాణ రన్ తో పాటు 22 వ తేదీ వరకు నిర్వహించిన వివిధ కార్యక్రమాలు విజయవంతం చేయడంలో కృషి చేసిన అధికారులను జిల్లా ఎస్పీ అభినందించి రివార్డ్స్ అందజేశారు.
ఈ సమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ లు విశ్వప్రసాద్, నాగేంద్రచారి, రవికుమార్, సి.ఐ లు,ఆర్.ఐ లు,ఎస్.ఐ లు ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.