టాలీవుడ్ హీరో ప్రభాస్( Prabhas ) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ప్రాజెక్టు కె.( Project K ) దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనే( Deepika Padukone ) హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.కాగా ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానున్న విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే.దానికి తోడు ఈ సినిమాపై తాజాగా నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ( Tammareddy Bharadwaj ) చేసిన కామెంట్స్ ఆ అంచనాలను మరింత పెంచేసాయి.
తమ్మారెడ్డి భరద్వాజ ఈ సినిమా గురించి మాట్లాడుతూ…ఒకప్పుడు సినిమా కలెక్షన్లు పాతిక, ముప్పై కోట్లు వస్తే గొప్ప అనుకున్నాము. ఇంద్ర సినిమా రూ.30కోట్లు సాధిస్తే, పెద్ద ఫంక్షన్ చేశారు.ఆ కార్యక్రమంలో చిరంజీవి గారు మీ రేంజ్‌కు సినిమా రూ.100కోట్లు చేయాలండీ అని అన్నాను.తెలుగులో ఆ మార్కు దాటడం కుదరదేమో అనుకున్నాము.కానీ బాహుబలి సినిమా విడుదల అయ్యాక వంద కాదు, ఏకంగా రూ.1000 కోట్లు ఈజీగా వచ్చేశాయి.ఆ తర్వాత దక్షిణాది చిత్రాలు కేజీయఫ్, కేజీయఫ్2, ఆర్‌ఆర్‌ఆర్ లు భారీ వసూళ్లను సాధించాయి.హిందీ సినిమాలను సైతం దాటి మంచి కలెక్షన్స్ రాబట్టాయి.
ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితా తీస్తే, అందులో ఎక్కువ దక్షిణాది చిత్రాలే ఉంటాయి.ఇప్పుడు పెద్ద సినిమాలు ఈజీగా రూ.200 కోట్లు దాటేస్తున్నాయి.ఇటీవల నెగెటివ్ టాక్ తెచ్చుకున్న ఆదిపురుష్ కూడా రూ.300కోట్లు దాటి కలెక్ట్ చేసింది.ప్రభాస్ ప్రస్తుతం హీరోగా నటిస్తున్న ప్రాజెక్ట్-కె సెట్‌కు నేను రెండు, మూడుసార్లు వెళ్లాను.
సినిమా మేకింగ్ చూసి ఆశ్చర్యమేసింది.ఇది గ్లోబల్ సినిమా. దీన్ని సరిగ్గా ప్రొజెక్ట్ చేయగలిగితే, వరల్డ్ టాప్-50 కలెక్షన్స్ చిత్రాల జాబితాలో ఇది ఉంటుంది రూ.1000 కోట్లు అనే మాటను ఇప్పుడు దాటేశాం.
ఇక మాట్లాడుకోవాల్సింది రూ.10వేలు, రూ.20వేల కోట్ల గురించే.తెలుగు చిత్రాలు ఇప్పుడు ప్రపంచ సినిమాలతో పోటీ పడుతున్నాయి.ప్రాజెక్ట్-కె సినిమాను ప్రణాళిక ప్రకారం ప్రచారం చేస్తే, మొదటి రోజే రూ.500 కోట్లు రావచ్చు.ఎందుకంటే ప్రభాస్ ఆదిపురుష్ మొదటి రోజు రూ.140 కోట్లు వసూలు చేసింది.ప్రభాస్‌కు ఉన్న క్రేజ్ అలాంటిది.బహుశా ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవికి విడుదల కావచ్చేమో.కాబట్టి చిత్ర బృందానికి ముందుగానే శుభాకాంక్షలు చెబుతున్నాను చెప్పుకొచ్చారు తమ్మారెడ్డి భరద్వాజ.