సోషల్ మీడియా( Social media ) అందుబాటులోకి వచ్చాక దేశం నలుమూలలా జరుగుతున్న అరాచకాలు గురించి ఇట్టే తెలిసిపోతుంది.మరీ ముఖ్యంగా స్ట్రీట్ ఫుడ్ గురించిన వీడియోలు ఇక్కడ ఎక్కువగా చక్కర్లు కొడుతూ ఉంటాయి.
అందులో కొన్ని ఆహా అనిపిస్తే మరికొన్ని అరాచకం అనిపిస్తూ ఉంటాయి.ప్రస్తుతం అలాంటి ఓ వీడియో ఒకటి నెటిజన్ల ఆగ్రహానికి గురవుతోంది.
దానిని తిన్నవారిపైన జాలి కలిగేలా చేస్తోంది ఆ వీడియో.అవును, మనలో చాలామంది పానీపూరీని చాలా ఇష్టంగా సేవిస్తూ వుంటారు.

ముఖ్యంగా నేటి యువత, అందులోనూ అమ్మాయిలు పానీపూరీని చాలా క్రేజీగా తింటూ వుంటారు.అలాంటివారు ఈ వీడియోని తప్పక చూడాలని మా మనవి.సాధారణంగా పానీపూరి ( Pani Puri )అనేది స్పైసీగా, పుల్లగా ఉంటుంది.కానీ ఇక్కడ పానీపూరి తియ్యగా ఉంటుంది.అవును, వినడానికే వాంతి వస్తుంది కదూ.ఇక దానిని ఎలా చేశారో మీరు చూశారంటే జన్మలో ఇక పానీపూరి జోలికి వెళ్లరు.గుజరాత్ కు చెందిన ఓ వీధి వ్యాపారి కొత్తగా బనానా పానీ పూరి ట్రై చేశాడు.తన వద్దకు వచ్చే వారికి దానిని రుచి చూపిస్తున్నాడు.జనాలు కూడా దాన్ని లొట్టలేసుకుని తింటున్నారు మరి.

దీనికి సంబందించిన వీడియోను మహ్మద్ ఫ్యూచర్వాలా అనే ట్విట్టర్( Twitter) యూజర్ పోస్టు చేయగా అదిప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.ఆ వీడియోని ఒక్కసారి గమనిస్తే స్పెసెస్, కొత్తిమీర, పచ్చిమిర్చి, శనగలు వేసి ఆఖర్లో బాగా పండిన అరటి పండ్లను వేసి చేతితో బాగా మిక్స్ చేయడం చూడవచ్చు.ఆ మిశ్రమాన్ని కలిపేటప్పుడు సదరు వ్యక్తి చేతికి గ్లౌజులు కూడా దొడగకపోవడం కొసమెరుపు.
ఇంకా ఇక్కడ ఆలూ స్థానంలో బనానా వేసి కలపడంతో నెటిజన్లు తీవ్ర కోపం వ్యక్తం చేస్తున్నారు.ఆ మిశ్రమంతోనే పానీ పూరీలు వడ్డిస్తూ కనిపించింది ఆ వీడియోలో.
ఈయన వద్దకు వచ్చిన ఓ అందమైన అమ్మాయికి ఈ బనానా పానీ పూరీ ఇవ్వడం ఆమె లొట్టలు వేసుకుంటూ తింటూ ఉండడం కూడా చూడవచ్చు.కాగా దీనిపైన నెటిజన్లు స్పందిస్తూ… ‘ఇదేం ఫుడ్ కాంబినేషన్ అంటూ’ పెదవి విరిస్తున్నారు.







