శ్రీలంక బౌలర్ హసరంగా ప్రపంచ రికార్డ్.. ఆ జాబితాలో తొలి ప్లేయర్ ఎవరంటే..?

భారత్ లో జరిగే వన్డే వరల్డ్ కప్( One Day World Cup ) కోసం ప్రస్తుతం మిగిలి ఉన్న రెండు స్థానాలకు 10 జట్ల మధ్య క్వాలిఫయర్ మ్యాచులు జరుగుతున్న సంగతి తెలిసిందే.తాజాగా శ్రీలంక-ఐర్లాండ్ ( Silanka vs Ireland ) మధ్య జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 325 పరుగులు చేసింది.

 Srilanka Bowler Hasaranga Breaks World Record Details, Srilanka, Bowler Hasarang-TeluguStop.com

శ్రీలంక ఓపెనర్ కరుణా రత్నే 103 పరుగులతో సెంచరీ చేయగా, సమర విక్రమ 82 పరుగులతో అర్థ సెంచరీ తో చెలరేగాడు.చివర్లో ధనుంజయ డిసిల్వా 42 పరుగులు చేయడంతో శ్రీలంక 325 పరుగులు నమోదు చేసింది.

లక్ష్యా చేదన కు దిగిన ఐర్లాండ్ 192 పరుగులకే ఆల్ అవుట్ అయింది.ఐర్లాండ్ బ్యాటర్లలో కాంఫర్ 39 పరుగులు చేయగా, మిగిలిన బ్యాటర్లు చెప్పుకోదగ్గ పరుగులు నమోదు చేయలేకపోయారు.

భారీ పరుగుల తేడాతో శ్రీలంక చేతిలో ఐర్లాండ్ ఓటమిని చవిచూసింది.

శ్రీలంక బౌలర్ హసరంగా( Hasaranga ) ఈ మ్యాచ్ లో ఏకంగా ఐదు వికెట్లు తీసి ప్రపంచ రికార్డును సమం చేశాడు.హసరంగా అంటే ఫార్మాట్ ఏదైనా, ఎక్కడ లీగ్ జరిగిన జట్టు విజయంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తాడని అందరికీ తెలిసిందే.ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టి చెమటలు పట్టించే అతి కొద్దిమంది బౌలర్లలో హసరంగా ను ఒకడిగా చెప్పుకోవచ్చు.

హాసరంగా తన కెరీర్లో ఎన్నో రికార్డులను నెలకొల్పాడు.తాజాగా జరిగిన మ్యాచ్లో ఓ అరుదైన రికార్డ్ సాధించాడు.

వన్డే క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఈ రికార్డ్ కేవలం పాకిస్తాన్ బౌలర్ పేరిట మాత్రమే ఉంది.తాజాగా హసరంగా కూడా అతని సరసన చేరాడు.ఆ రికార్డు ఏమిటంటే వరుసగా మూడుసార్లు ఐదు వికెట్లు తీసిన బౌలర్గా ప్రపంచ రికార్డ్ నెలకొల్పాడు.క్వాలిఫైయర్ మ్యాచ్లలో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్లలో 16 వికెట్లు తీసి క్వాలిఫైయర్ మ్యాచ్లలో ప్రథమ స్థానంలో నిలిచాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube