నల్లగొండ జిల్లా: చత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్ క్రీడాకారులకు రిటైర్డ్ ఏఎస్ఐ వెంకటేశ్వర్లు 10 జతల స్పోర్ట్స్ కిట్స్ ను వన్ టౌన్ సిఐ గోపి ద్వారా ఆదివారం అందజేశారు.ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి సీఐ గోపి మాట్లాడుతూ క్రీడాకారులు దీర్ఘకాలిక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ఆ ప్రయాణంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా లక్ష్యం వైపు పయనిస్తే ఉజ్వల భవిష్యత్తును పొందవచ్చన్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు మాట్లాడుతూ జిల్లా స్థాయిలో కూడా కార్పొరేట్ సంస్థలు ముందుకు వచ్చి కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ (CSR) ఫండ్స్ ని గ్రాస్ రూట్ లో ఉపయోగిస్తే ప్రొఫెషనల్ క్రీడాకారులను తయారు కావడమే కాకుండా,ఆణిముత్యాల లాంటి క్రీడాకారులను సొసైటీకి అందించిన వారవుతారని,తద్వారా కార్పొరేట్ సంస్థలకు మంచి పేరు మరియు వారి ఉత్పత్తులకు క్షేత్రస్థాయిలో మంచి ప్రాచుర్యం లభిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఫుట్బాల్ కోచ్ మద్ది కరుణాకర్ సీనియర్ క్రీడాకారులు తాజుద్దీన్,ఇమ్రాన్,బెల్లి రాజు,రాచూరి వెంకట సాయి,యశ్వంత్,సిరి తదితరులు పాల్గొన్నారు.