ఒకప్పుడు మోదీపై విమర్శలు.. ఇప్పుడు స్టాండింగ్ ఒవేషన్.. ఆ ఎన్నారై ఎవరంటే..??

అమెరికా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( PM Narendra Modi ) అమెరికా పార్లమెంటులో తన ప్రసంగంతో అందరి చేత చప్పట్లు కొట్టించుకున్నారు.రెండోసారి యూఎస్ కాంగ్రెస్‌ని( US Congress ) ఉద్దేశించి ప్రసంగించే అరుదైన అవకాశాన్ని మోదీ పొందారు.

 Once A Modi Critic Us Politician Pramila Jayapal Gives Pm A Standing Ovation Det-TeluguStop.com

మోదీ ఇచ్చిన ప్రసంగం విని గతంలో భారతదేశాన్ని విమర్శించిన కాంగ్రెస్‌ సభ్యురాలు ప్రమీలా జయపాల్‌( Congresswoman Pramila Jayapal ) సైతం ఆయనకు స్టాండింగ్‌ ఒవేషన్‌ ఇచ్చి మద్దతు పలికారు.

గతంలో ఎన్నారై జయపాల్ 75 మంది అమెరికా సెనేటర్లు సంతకం చేసిన లేఖలో భారతదేశంలో మానవ హక్కుల గురించి ఆందోళన వ్యక్తం చేశారు.అయితే, మోదీ ప్రసంగం సందర్భంగా, భారతదేశంలో మానవ హక్కుల గురించి బలమైన అంశాలు తెలుసుకుని ఆమె ఫిదా అయ్యారు.తర్వాత ప్రశంసించారు.

దీన్ని గమనించిన బీజేపీ ఐటీ సెల్ ఇన్‌చార్జ్ అమిత్ మాల్వియా.( Amit Malviya ) జయపాల్ మోదీ ప్రసంగాన్ని అభినందిస్తున్న ఫొటోలు, వీడియోలను ట్విట్టర్‌లో షేర్ చేశారు.

ఆ ఫొటోలు వైరల్ గా మారాయి.తిట్టిన వాళ్లతోనే పొగిడించుకునే నైజం మోదీది అని చాలామంది బీజేపీ సానుభూతిపరులు కామెంట్స్ చేస్తున్నారు.

ముఖ్యంగా రిపబ్లికన్ సెనేటర్ల నుంచి యూఎస్ కాంగ్రెస్‌ (పార్లమెంట్)లో మోదీ ప్రసంగంపై ప్రశంసలు వెల్లువెత్తాయి.కాంగ్రెస్‌లో ద్వైపాక్షిక మద్దతుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.భారతదేశం పురోగతిని హైలైట్ చేశారు.మోదీ తన ప్రసంగంలో 15 స్టాండింగ్ ఒవేషన్లు, 79 రౌండ్ల చప్పట్లు అందుకున్నారు.సెనేటర్లు అతనితో ఆటోగ్రాఫ్‌లు, సెల్ఫీల కోసం కూడా బారులు కూడా తీరారు.నిజానికి మోదీ సభలో అడుగుపెట్టగానే సేనేటర్లు కరచాలనం చేయడానికి ఎగబడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube