టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ ( Director Sujeeth )దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఒక ప్రాజెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.పవన్ లైనప్ లో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ఇదే కావడంతో ఫ్యాన్స్ కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.
అందుకే ఏ చిన్న అప్డేట్ వచ్చిన ఈ సినిమాపై ఇంకా ఇంట్రెస్ట్ పెట్టి మరీ వింటున్నారు.వరుస అప్డేట్ లను అందిస్తూ మరింత హోప్స్ పెంచుకుంటున్న ఈ సినిమా నుండి తాజాగా మరో అప్డేట్ బయటకు వచ్చింది.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ స్నేహితుడు అలీ కూడా ఉన్నట్టు కొద్దీ రోజులుగా గాసిప్స్ వస్తున్న విషయం తెలిసిందే.పవన్ కళ్యాణ్, అలీ కాంబో అంటే ప్రేక్షకులకు చాలా ఇష్టం.
వీరిద్దరూ మంచి స్నేహితులుగా మారిపోయారు.పవన్ కళ్యాణ్ కెరీర్ స్టార్టింగ్ అప్పటి నుండి అలీ పవన్ సినిమాల్లో చేస్తూ వస్తున్నాడు.
అయితే ఈ మధ్య కాలంలో వీరి మధ్య కొద్దిగా గ్యాప్ వచ్చింది.

అందుకే పవన్ కళ్యాణ్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత అలీ పవన్ సినిమాలో నటించలేదు.కానీ ఇప్పుడు ఓజి సినిమాలో నటించబోతున్నాడు అని టాక్ వచ్చింది.కానీ ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది.
అలీ ఓజి సినిమాలో లేడని క్లారిటీ తెలుస్తుంది.అలీ బదులుగా వేరే కమెడియన్ ను తీసుకున్నట్టు తెలుస్తుంది.
మొత్తానికి పవన్ సినిమాల్లో ఇకపై అలీ కనిపించే అవకాశం లేదనే చెప్పాలి.

ఇక ప్రజెంట్ పవన్ రాజకీయ టూర్ లో బిజీగా ఉండడంతో ఆయన లేని పోర్షన్ ను పూర్తి చేస్తున్నారు.కాగా మాసివ్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడీగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.
డివివి దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్ పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.







