కరీంనగర్ లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.మంత్రి గంగుల కమలాకర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేత రోహిత్ రావు మీడియా సమావేశం నిర్వహించారు.
తొలుత మహాశక్తి ఆలయం వద్ద రోహిత్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు.అనంతరం శాంతిభద్రతలకు విఘాతం కలగకూడదంటూ రోహిత్ రావును అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్ కు తరలించారు.
ఈ క్రమంలో బండి సంజయ్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో తీవ్ర ఉద్రికత్త నెలకొంది.







