టాలీవుడ్ హీరో కింగ్ అక్కినేని నాగార్జున( Nagarjuna ) భార్య అమల గురించి మనందరికీ తెలిసిందే.నాగార్జునకు అమల( Amala ) రెండవ భార్య అన్న విషయం మనందరికీ తెలిసిందే.
ఈమె జంతు ప్రేమికురాలు అన్న విషయం మనందరికీ తెలిసిందే.ఈమె సోషల్ మీడియాలో చాలా తక్కువగా యాక్టివ్ గా ఉంటుంది.
ఇలా ఉంటే తాజాగా అమల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా హీరో అఖిల్( akhil ) నాగచైతన్యగురించి స్పందించింది అమల.ఈ సందర్భంగా నాగచైతన్య( Naga chaitanya ) పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.చైతన్య చాలా తెలివైన వాడు.
అతనికి ఏం కావాలో స్పష్టంగా తెలుసు.

అన్ని విషయాలలో క్లారిటీతో ఉంటాడు.అత్యంత ధైర్యవంతుడు.అంతేకాదు కెరీర్ పట్ల, పని పట్ల చాలా ఫోకస్‌గా ఉంటాడు.
చాలా బ్రిలియంట్ అని తెలిపింది.అమల.అయితే అమల చేసిన వాఖ్యలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.చైతూని ప్రశంసలతో ముంచెత్తడం ఆశ్చర్యపరుస్తోంది.
చైతూ అభిమానులను ఖుషి చేస్తోంది.అఖిల్ గురించి స్పందిస్తూ.
అఖిల్‌కి మనుషులంటే బాగా ఇష్టం.పీపుల్ లవ్వింగ్ పర్సన్, మనుషులను ఎక్కువగా ప్రేమిస్తాడు అని తెలిపింది అమల.అయితే ఇంటర్వ్యూలో భాగంగా అమల అఖిల్ గురించి కంటే చైతన్య గురించి ఎక్కువగా మాట్లాడటం చైతన్యని ఎక్కువగా ప్రశంసించడం ప్రస్తుతం ఆసక్తి కరంగా మారింది.

ఇంటర్వ్యూలో చైతన్య గురించి ఎక్కువగా మాట్లాడడంతో అమలకి అఖిల్ కంటే చైతన్యనే ఎక్కువ ఇష్టమేమో అందుకే అఖిల్ గురించి మాట్లాడడానికి ఎంతగా ఇష్టపడలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.ఇకపోతే అమల ఇటీవలే ఒకే ఒక జీవితం సినిమాలో నటించిన విషయం తెలిసిందే.ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది.
హీరో అఖిల్ ఇటీవల ఏజెంట్ సినిమాతో ప్రేక్షకులను పలకరించగా పాన్ ఇండియా లెవెల్లో విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ నిలిచింది.నాగచైతన్య కస్టడీ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు.







