తన సామాజిక వర్గం కోసం అనేక ఉద్యమాలు చేశానని, దానికోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నానని తరచూ చెప్పుకునే ముద్రగడ, పవన్ కళ్యాణ్( Pawan kalyan ) విషయంలో వ్యవహరిస్తున్న విదానం మాత్రం మెజారిటీ కాపు యువత లో అసహనానికి దారితీస్తున్నట్లుగా తెలుస్తుంది.నిజానికి వాస్తవానికి దూరంగా ఉన్న కాపు రిజర్వేషన్( Kapu reservation ) అంశంపై ఆయన చేసిన ఉద్యమాల వల్ల కాపులకు జరిగిన మంచి కన్నా చెడే ఎక్కువ అన్నది ఒక విశ్లేషణ.
సామాజికంగానూ ఆర్థికంగానూ బలంగా ఉన్న కాపు నియోజకవర్గానికి రిజర్వేషన్ అన్నది చట్టప్రకారం కుదరని వ్యవహారం అయినప్పటికీ మొండి పట్టుదలతో ఆ విషయంలో కాపులనుఉసిగొలిపి తుని సంఘటన లాంటి వాటికి కారణమయ్యారని ఆయన పై ఆరోపణలు లేకపోలేదు.

ముద్రగడ ( Mudragada Padmanabham )నిజాయితీని శంకించలేకపోయినప్పటికీ ఆయన వల్ల ఆ సామాజిక వర్గం ఇబ్బంది పడింది అన్నది మాత్రం నిజమనే చెప్పాలి.అయితే ఇంతకాలం తర్వాత తమ సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుకు వస్తున్న పవన్ కళ్యాణ్ కి కనీసం మద్దతు ఇవ్వాల్సింది పోయి తన రాజకీయ ప్రయోజనాల కోసం ఆయనకు ఎదురు నిలబడటాన్ని కాపు సామాజిక వర్గంలోని యువత సహించలేకపోతున్నదని , అందుకే విమర్శల తో ఆయనను నిలదీస్తున్నదని వార్తలు వస్తున్నాయి.కాపు అభ్యున్నతి ఆయన ధ్యేయమైతే ,తమ సామాజిక వర్గం వ్యక్తి ముఖ్యమంత్రి అయితే కచ్చితంగా సామాజిక వర్గానికి మేలు జరుగుతుంది, మరి అలాంటప్పుడు ఆయన పవన్ ను ఎందుకు అడ్డుకుంటున్నారన్నది పెద్ద ప్రశ్నగా మారింది .

వైసీపీ తరచుగా చేసే విమర్శలని అస్త్రంగా చేసుకొని ఆయన లేఖను రాయడం ద్వారా తాను వైసీపీకి చెందిన వ్యక్తిని అనే ముద్ర ఆయనే వేసుకున్నట్లయ్యింది .పవన్ కళ్యాణ్ సినిమాల్లో గాని రాజకీయాలలో గాని యాక్టివ్గా లేనప్పుడు జరిగిన సంఘటనల పై ఆయన ఎందుకు స్పందించలేదు అంటూ రాసిన రెండవ లేఖ పవన్ కళ్యాణ్ పై ముద్రగడ చేస్తున్న విమర్శలలోని విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేసింది.వంగవీటి రంగా హత్య సమయంలో కనీసం యుక్త వయసు కూడా రాని పవన్ కళ్యాణ్ స్పందించలేదని అడగటం ఏమాత్రం సమంజసమైన ప్రశ్న అని ఆయన ప్రశ్నించుకోవాలని జనసేన వర్గాలు అంటున్నాయిఇంతకాలం తర్వాత తమకు వచ్చిన సువర్ణవకాశాన్ని చెడగొట్టడానికి వచ్చిన రాజకీయ శిఖండి గా కాపు సామాజిక వర్గం ఆయనను అభివర్ణిస్తుంది .







