షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా తొలి సంపాదన ఎంతో తెలుసా?

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్( Shahrukh Khan ) గురించి పరిచయం అవసరం లేదు కొన్ని వేలకోట్లకు అధిపతి అయినటువంటి షారుఖ్ ఖాన్ ఇప్పటికీ వరుస సినిమాలలో నటిస్తూ అందరిని సందడి చేస్తున్నారు.ఇకపోతే ఈయన కుమార్తె సుహానా ఖాన్ ( Suhana Khan ) ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ సందడి చేస్తున్నారు.

 Do You Know The First Earnings Of Shah Rukh Khan's Daughter ,shahrukh Khan, The-TeluguStop.com

ఈమెకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తుంటారు.ఇలా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టకముందే సుహానా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.

Telugu Bollywood, Shahrukh Khan, Suhana Khan-Movie

ఈమె త్వరలోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం మనకు తెలిసిందే.ఆమె జోయా అక్తర్‌ దర్శకత్వంలో రూపొందిన `ది అర్చీస్‌` అనే సినిమాలో నటిస్తుంది.ఈ సినిమాలో బోనీ కపూర్‌ రెండో కుమార్తె ఖుషీ కపూర్‌, అమితాబ్‌ బచ్చన్‌ మనవడు అగస్త్య నందా కూడా నటిస్తుండటం విశేషం.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైనటువంటి టీజర్ భారీగా అంచనాలను పెంచేసింది.

అయితే వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది.తాజాగా సుహాన ఖాన్ కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా( Social media )లో వైరల్ గా మారింది.

Telugu Bollywood, Shahrukh Khan, Suhana Khan-Movie

ఈమె తన తొలి సంపాదనతో భారీగా ఆస్తులను కొనుగోలు చేశారని తెలుస్తోంది.అయితే తన తొలి సంపాదనతోనే కోట్లు విలువచేసే ఆస్తులను కొనుగోలు చేశారని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.ఈమె తన తొలి సంపాదనతో రూ.12.91కోట్లతో ఆస్తులను కొనుగోలు చేసిందట. ఇందులో భాగంగానే మూడు ఇళ్లతోపాటు, ఒక ప్లాట్‌ని కొనుగోలు చేసినట్టు బాలీవుడ్‌ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి.

జూన్ 1వ తేదీ ఈమె పేరు మీదట ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్ అయ్యాయని తెలుస్తోంది.ఇలా ఇంత చిన్న వయసులోనే తన తొలి సంపాదనతో కోట్లు విలువ చేస్తే ఆస్తులను కొనుగోలు చేస్తూ సుహానా ఖాన్ అందరిని ఆశ్చర్యపరిచారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube