ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా రేంజ్ గుర్తింపుని దక్కించుకున్న స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ.( Kiara Advani ) ఈమెకి యూత్ లో ఉన్న క్రేజ్ మామూలుది కాదు.
సుశాంత్ సింగ్ రాజ్ పుట్ హీరో గా ప్రముఖ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని బయోపిక్ ‘Ms ధోని : ది అన్ టోల్డ్ స్టోరీ’( MS Dhoni The Untold Story ) తెరకెక్కింది.ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా కియారా అద్వానీ నటించింది.
ఈ సినిమా అతిపెద్ద కమర్షియల్ సక్సెస్ అవ్వడం తో కియారా అద్వానీ కి అవకాశాలు క్యూ కట్టాయి.తెలుగు లో ఈమె సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన ‘భరత్ అనే నేను’ సినిమా ద్వారా పరిచయం అయ్యింది.
ఈ సినిమా పెద్ద హిట్ అవ్వడం తో వెంటనే రామ్ చరణ్ తో ‘వినయ విధేయ రామ’ అనే సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కింది.

ఆ సినిమా కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయ్యింది కానీ, కియారా అద్వానీ క్రేజ్ మాత్రం ఇసుమంత కూడా తగ్గలేదు.టాలీవుడ్ ఆ తర్వాత ఆమెకి వరుస ఆఫర్స్ వచ్చినా, ఆమె ఎక్కువగా బాలీవుడ్ కి ప్రాధాన్యత ఇచ్చింది.అక్కడి క్రేజీ స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి అతి తక్కువ సమయం లోనే బాలీవుడ్ లో బడా స్టార్ హీరోయిన్ గా నటించింది.
ఆ తర్వాత ఈమె ప్రముఖ బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా ని( Siddharth Malhotra ) ప్రేమించి పెళ్లాడింది.పెళ్ళికి పది రోజులు ముందు కూడా వీళ్ళు మా మీడియా కి మా మధ్య ఏమి లేదంటూ చెప్పుకొచ్చారు.
కానీ అకస్మాత్తుగా ఇద్దరు పెళ్లి చేసుకొని ఫోటోలు దిగి అందరికీ ఊహించని షాక్ ని ఇచ్చారు.వీళ్లిద్దరు కలిసి కేవలం ఒకే ఒక్క సినిమాలో నటించారు.ఆ ఒక్క సినిమాతోనే వీళ్ళ మధ్య ఇంత ప్రేమ పుట్టిందట.అదే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం.

ఇదంతా పక్కన పెడితే కియారా అద్వానీ సిద్దార్థ్ మల్హోత్రా కి ముందు అంబానీ కొడుకు ఆకాష్ అంబానీ తో( Akash Ambani ) ప్రేమాయణం నడిపాడట.అసలు విషయానికి వస్తే కియారా అద్వానీ తండ్రి జగదీశ్ అద్వానీ కూడా ఒక పెద్ద వ్యాపారవేత్త అట.చిన్నప్పటి నుండి ముకేశ్ అంబానీ కి మంచి క్లోజ్ ఫ్రెండ్ కూడా.చిన్నప్పటి నుండి కియారా అద్వానీ ధీరుభాయి ఇంటర్నేషనల్ స్కూల్ లో ఈషా మరియు ఆకాష్ తో కలిసి చదువుకునేదట.
అలా ఆకాష్ తో కియారా అద్వానీ కి మంచి స్నేహం ఏర్పడింది.ఆ స్నేహం కాస్త వయస్సు పెరిగే కొద్దీ ప్రేమగా మారింది.అయితే కియారా అద్వానీ కి మొదటి నుండి మోడల్ అవ్వాలని కోరిక.కానీ ఆకాష్ అంబానీ కి అది ఇష్టం లేదు, ఎంత చెప్పిన కియారా అద్వానీ ఇందుకు ఒప్పుకోలేదట.
దీంతో వీళ్లిద్దరి మధ్య బ్రేకప్ జరిగింది.ఆ తర్వాత కొన్నాళ్ళు విదేశాల్లో చదువుకొని ఇండియా కి వచ్చిన ఆకాష్ అంబానీ తన చిన్ననాటి స్నేహితురాలు శ్లోక మెహతా ని పెళ్లి చేసుకున్నాడు.
అలా కియారా అద్వానీ ముకేశ్ అంబానీ ఇంటికి కోడలు అయ్యే అదృష్టాన్ని వదులుకుంది.







