బీహార్ రాజధాని పాట్నాలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్( Nitish Kumar ) ఆధ్వర్యంలో విపక్షాల సమావేశం జరగటం తెలిసిందే.ఈ సమావేశం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆర్జెడి నేత లాలు ప్రసాద్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ( Rahul Gandhi ) ఇప్పటికైనా పెళ్లి చేసుకోవాలని సూచించారు.పెళ్లి చేసుకోకుండా ఉండటం అంటే తల్లికి వేదన కలిగించటమేనని హెచ్చరించారు.
మా విన్నపాన్ని నువ్వు సరిగ్గా పట్టించుకోవటం లేదంటూ రాహుల్ పై లాలూ ప్రసాద్ యాదవ్( Lalu Prasad Yadav ) కొద్దిగా సీరియస్ అయ్యారు.పెళ్లి చేసుకోవాలని గతంలో కూడా తాను చెప్పినట్లు.
అప్పుడే వినుంటే వాటికి పెళ్లయిపోయి ఉండేదని పేర్కొన్నారు.పెళ్లి వద్దంటూ తల్లికి చిరాకు తీసుకురావద్దు అని లాలూ రాహుల్ కి తెలియజేశారు.
నా మాట విని పెళ్లి చేసుకో నీ పెళ్లి ఊరేగింపులో మేము పాల్గొంటామని అన్నారు.ఇప్పటికైనా గడ్డం తీసి పెళ్ళికి… రెడీ అవ్వాలని కోరాటం జరిగింది.ఇక ఇదే సమయంలో పాదయాత్రతో మరింతగా ప్రజలకు రాహుల్ దగ్గరయ్యారని లాలు చెప్పుకొచ్చారు.ఈ క్రమంలో పెళ్లి విషయంలో లాలూ సూచన పాటిస్తానని రాహుల్ పేర్కొనటం గమనార్హం.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించిన ఈ సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తదితరులు పాల్గొన్నారు.







