ముల్తానీ మట్టి అందానికే కాదు జుట్టు సంరక్షణకు కూడా.. ఇలా వాడితే మస్తు బెనిఫిట్స్!

ముల్తానీ మట్టి( Multani mitti ).దీని గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు.

 Amazing Benefits Of Multani Mitti For Hair! Hair, Hair Care, Hair Care Tips, Mul-TeluguStop.com

చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకునేందుకు ముల్తానీ మట్టిని విరివిరిగా వాడుతుంటారు.అలాగే అనేక చర్మ సంబంధిత సమస్యల నుంచి బయటపడేందుకు కూడా ముల్తానీ మట్టి అద్భుతంగా సహాయపడుతుంది.

అయితే ముల్తానీ మట్టి అందానికే కాదు జుట్టు సంరక్షణకు సైతం ఉపయోగపడుతుంది.ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే విధంగా ముల్తానీ మట్టిని వాడితే మస్తు బెనిఫిట్స్ లభిస్తాయి మరి ఇంకెందుకు ఆలస్యం ఆరోగ్యకరమైన జుట్టు కోసం ముల్తానీ మట్టిని ఎలా వాడాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ముల్తానీ మట్టి వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్( Aloe Vera Gel ) వేసుకోవాలి.

ఆ తరువాత మూడు టేబుల్ స్పూన్లు మీ రెగ్యులర్ షాంపూను వేసి అన్ని బాగా కలిసేంతవరకు మిక్స్ చేసుకోవాలి.చివరిగా ఒకటిన్నర గ్లాసు వాటర్ పోసి మరోసారి కలుపుకోవాలి.

Telugu Care, Care Tips, Latest, Multani Mitti, Multanimitti-Telugu Health

ఇప్పుడు ఈ వాటర్ ను ఉపయోగించి హెయిర్ వాష్ చేసుకోవాలి.ఈ విధంగా వారానికి రెండు సార్లు హెయిర్‌ వాష్ చేసుకుంటే జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిది.ముఖ్యంగా ముల్తానీ మట్టి కుదుళ్ల‌ను బలోపేతం చేస్తుంది.జుట్టు రాలడాన్ని అడ్డుకుంటుంది.అలాగే అలోవెరా జెల్ కురులను స్మూత్ గా షైనీగా మారుస్తుంది.చాలా మంది తరచూ జుట్టును సిల్కీగా మార్చుకునేందుకు హెయిర్ స్పా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు.

Telugu Care, Care Tips, Latest, Multani Mitti, Multanimitti-Telugu Health

ఇందుకోసం వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు.కానీ ఇప్పుడు చెప్పిన విధంగా షాంపూ చేసుకుంటే స్పా ట్రీట్మెంట్ అక్కర్లేదు.సహజంగానే మీ జుట్టు సిల్కీ గా మారుతుంది.అంతే కాదండోయ్ పైన చెప్పిన విధంగా హెయిర్ వాష్ చేసుకుంటే జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుంది.జుట్టు నుంచి చెడు వాసన రాకుండా ఉంటుంది.కాబట్టి ఒత్తైన ఆరోగ్యమైన జుట్టు కావాలని కోరుకునేవారు ముల్తానీ మట్టితో పైన చెప్పిన విధంగా షాంపూ చేసుకునేందుకు ఖచ్చితంగా ప్రయత్నించండి.

మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube