ఎక్కువ ఫామ్‌-16లు ఉంటే ఐటీ రిటర్న్‌ ఎలా ఫైల్ చేయాలో తెలుసుకోండి!

ఎక్కువ ఉద్యోగాలు మారేవారికి ఇన్‌కం టాక్స్‌ రిటర్న్‌( IT Returns ) ఎలా ఫైల్‌ చేయాలో తెలియక ఇబ్బందులు పడుతూ వుంటారు.ఒక ఆర్థిక సంవత్సరంలో ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు చేసిన టాక్స్‌ పేయర్లు( Tax Payers ) ఒకటి కంటే ఎక్కువ ఫామ్-16( Form-16 ) పొందుతారనే విషయం అందరికీ తెలిసినదే.

 Learn How To File It Return If There Are Multiple Form-16 Details, Learn How , L-TeluguStop.com

ఐతే దానివల్ల, రిటర్న్ దాఖలు చేసేటప్పుడు మొత్తం ఆదాయం, డిడక్షన్స్‌ లెక్క తేలక తికమక పడుతూ వుంటారు.ఆదాయపు పన్ను పత్రాలు దాఖలు చేయడానికి అత్యంత కీలక డాక్యుమెంట్‌ ఫామ్‌-16 అన్న సంగతి అందరికీ తెలిసినదే.

ఇది ఓ రకమైన TDS సర్టిఫికేట్. యాజమాన్య కంపెనీ తన ఉద్యోగికి దీనిని జారీ చేస్తుంది.

Telugu Financial, Return, Form, Tax, Returns, Latest, Learn, Multiple Form, Sala

మీరు ఆర్థిక సంవత్సరం మధ్యలో ఉద్యోగం మారినట్టయితే, మొదట ఫారం-12Bని కొత్త యజమానికి ఇవ్వాలి.ఈ ఫారమ్-12Bని పాత కంపెనీ నుంచి మొదట తీసుకోవాలి.ఎందుకంటే పాత కంపెనీ నుంచి పొందిన జీతం, HRA వంటి మినహాయింపులు, సెక్షన్‌ 80D, సెక్షన్‌ 80C, TDS వంటి డిడక్షన్స్‌ అందులో ఉంటాయి.అందువలన కొత్త కంపెనీ, మొత్తం సంవత్సరానికి మీ పన్ను బాధ్యతను లెక్కించేటప్పుడు ఫారం-12Bని వాడుకుంటుదన్నమాట.

దాంతో కంబైన్ ఫారం-16ని జారీ చేస్తుంది.

Telugu Financial, Return, Form, Tax, Returns, Latest, Learn, Multiple Form, Sala

అయితే ఇక్కడ 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగం మారి, కొత్త కంపెనీకి ఫారం-12Bని మీరు ఇవ్వకుంటే పాత కంపెనీతో పాటు, కొత్త కంపెనీ కూడా మీకు ఫామ్‌-16 జారీ చేస్తుంది.దాంతో మీ దగ్గర 2 ఫామ్‌-16లు ఉంటాయి.అలాంటి సందర్భంలో రిటర్న్ దాఖలు చేసేటప్పుడు రెండు ఫారం-16ల్లో ఉన్న గ్రాస్‌ శాలరీని కలిపితే టోటల్‌గా మీ గ్రాస్‌ శాలరీ అవుతుంది.

అదేవిధంగా, హౌస్ రెంట్ అలవెన్స్ (HRA), LTA వంటి మినహాయింపు మొత్తాన్ని ఫామ్-16 రెండింటి నుంచి యాడ్‌ చేసుకోవాలి.తదుపరి దశ 80C, 80D వంటి డిడక్షన్స్‌ క్లెయిమ్ చేసుకోవలసి ఉంటుంది.

ఈ తగ్గింపులను తీసివేసిన తర్వాత మిగిలిన మొత్తం ‘నెట్‌ టాక్సబుల్‌ ఇన్‌కమ్‌’ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube