40 సంవత్సరాల అకాంక్షను నెరవేర్చిన వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ కి ధన్యవాదాలు!

రాజన్న సిరిసిల్ల జిల్లా: హన్మాజిపెట నక్క వాగుపై రు.11.55 కోట్లతో హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరీ చేయించిన శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు( Chennamaneni Ramesh Babu ) ని నేడు వారి నివాసంలో సెస్ డైరక్టర్ దేవరాజం, హనుమాజిపేట సర్పంచ్ విజయా శ్రీనివాస్ రెడ్డి, బొల్లారం సర్పంచ్ లచ్చయ్య, పార్టీ మండల అధ్యక్షులు గోస్కుల రవి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమాన్డ్లు, పార్టీ నాయకులు ఘనంగా ఎం.ఎల్.ఏ రమేష్ ని సన్మానించి ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా ఎం.ఎల్.ఏ మాట్లాడుతూ మొదటగా బ్రిడ్జి మంజూరీ కొరకు సహకరించిన మంత్రి కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి లకు, రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ బీ.వినోద్ కుమార్ కి మనందరి తరుపున ధన్యవాదాలు అన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 100 రోజుల్లో ఇచ్చిన వాగ్దానాలను పూర్తి చేస్తామని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేసారని అందరికీ గృహలక్ష్మీ పథకం ద్వారా అందిస్తామని అన్నారు.

 Vemulawada Legislators Thank Chennamaneni Ramesh For Fulfilling A 40 Year Dream-TeluguStop.com

ఇంకా మిగిలి ఉన్న రోడ్లు బ్రిడ్జిలు అన్ని వచ్చే రెండు మాసాల్లో మంజూరు చేసుకుంటామని అన్నారు.మేము మా ప్రజా ప్రతినిధులు చిత్తశుద్ధితో సమస్యల పరిష్కారం చేస్తున్నామని మొన్న జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో కూడా మిగిలి ఉన్న సమస్యలపై చర్చించుకొని మా అధిష్టానానికి సమస్యలను లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగిందని అన్నారు.

నియోజకవర్గంలో నిబద్ధతతో, నియమావళితో సమస్యల పరిష్కారానికి బి.ఆర్.ఎస్.పార్టీ మరియు పార్టీ శ్రేణులు పనిచేస్తున్నారని అన్నారు.భవిష్యత్తు సవాళ్ళకు దీటైన జవాబు ఏకైక పార్టీ బి.ఆర్.ఎస్ మాత్రమే అని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హనుమాండ్లు గారు, సర్పంచులు, ఎం.పి.టి.సీలు, ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube