Chandrababu Bill Gates: బిల్ గేట్స్ తో బాబు మొదటి మీటింగ్ కి నేనే సాక్షిని : మురళి మోహన్

చంద్రబాబు( Chandrababu Naidu ) హయాంలోనే తెలుగు రాష్ట్రమైన ఉమ్మడి ఆంధ్ర ప్రదేష్ కి సాఫ్ట్ వేర్ కంపెనీలు వచ్చాయి అనే విషయం మన అందరికీ తెలిసిందే.ఆయన వల్లే హైదరాబాద్ అభివృద్ధి కూడా సాధ్యమైంది.

 Chandra Babu Naidu First Meeting With Bill Gates Revealed By Actor Murali Mohan-TeluguStop.com

అలాగే హైటెక్ సిటీ లో ఐటి భవనాలు కూడా వేలిసాయి.ఈరోజు హైదరాబాద్ ఐటి హబ్ గా మారింది అంటే అందులో బాబు కృషి, పట్టుదల ఖచ్చితంగా ఉన్నాయి.

ఆయన విజన్ చాలా ముందు చూపుతో ఉంటుంది.అయితే హైదరాబాద్ కి మొట్టమొదటి సాఫ్ట్ వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ రావడానికి ఆయన పడిన కష్టం అంతా ఇంత కాదు.

చంద్రబాబు అమెరికా వెళ్లి బిల్ గేట్స్ ని( Bill Gates ) కలిసిన రోజున ఏం జరిగింది? ఎలా హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ కంపెనీ( Microsoft Company ) తన బ్రాంచ్ ని ఓపెన్ చేసింది అనే విషయాలను ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

హైదరాబాద్ కి మైక్రోసాఫ్ట్ కంపెనీ రావడానికి వెనుక చంద్రబాబు చాలా కష్టమే పడ్డారు.

దానికి ప్రత్యక్ష సాక్షి సినీ నటుడు మురళీమోహన్.( Murali Mohan ) ఆరోజు ఆయన కూడా చంద్రబాబుతోనే ఉన్నారు.

బాబు బిల్ గేట్స్ అపాయింట్మెంట్ కోసం తీవ్రంగా కష్టపడ్డారు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ని నేను.

నాకు మిమ్మల్ని కలిసే అవకాశం ఇవ్వండి అంటూ బిల్ గేట్స్ కి ఎంతగానో విన్నపించారు.మొదట ఆయన అనుమతి దొరక్కపోయినా ఆ తర్వాత బాబు పట్టుదల చూసి ఒక అరగంట టైం ఇచ్చారు బిల్ గేట్స్.

చెప్పిన టైం కన్నా ముందే వెళ్లి చంద్రబాబు మైక్రోసాఫ్ట్ ఆఫీసులో బిల్ గేట్స్ పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు.

Telugu Gates, Chandra Babu, Hitech, Hyderabad, Hyderabad Hub, Micro Soft, Murali

సరిగ్గా వారు టైం ఇచ్చిన ప్రకారమే లోపలికి పిలిచారు.దాంతో బిల్ గేట్స్ తో మీటింగ్ మొదలయింది.అరగంట కాస్త ఆ మీటింగ్ రెండు గంటల పాటు చంద్రబాబు మాట్లాడుతూనే ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్ యొక్క వనరులు, మన దగ్గర అందుబాటులో ఉన్న స్టూడెంట్స్, అలాగే మైక్రోసాఫ్ట్ కి సంబంధించిన బ్రాంచ్ ఓపెనింగ్ కి కావాల్సిన అన్ని రకాల వసతులు కల్పిస్తామని బిల్ గేట్స్ కి వాగ్దానం చేశారు చంద్రబాబు.అప్పటి వరకు ప్రపంచంలో అమెరికాలో తప్ప మరే దేశంలో కూడా ఆ కంపెనీకి బ్రాంచ్ లేదు.

Telugu Gates, Chandra Babu, Hitech, Hyderabad, Hyderabad Hub, Micro Soft, Murali

కానీ ఎప్పుడైనా నేను అమెరికా కాకుండా బయట బ్రాంచ్ పెట్టాలనుకున్నప్పుడు అది హైదరాబాద్ లోనే జరుగుతుంది అంటూ ఆరోజు మాటిచ్చారు.అలా మైక్రోసాఫ్ట్ మొదట హైదరాబాద్ లో బ్రాంచ్ ఓపెన్ చేసింది.ఆ తర్వాత ఆ కంపెనీని చూసి చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ లైన్ గా హైదరాబాదులోనే ఐటీ కంపెనీలను ఏర్పాటు చేసాయి.అలా ఈరోజు కొన్ని లక్షల మంది సాఫ్ట్వేర్ ద్వారా ఉపాధి పొందుతున్నారు దానికి ముఖ్య కారణం చంద్రబాబు పట్టుదల.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube