ఆదిపురుష్ 7 రోజుల కలక్షన్స్ ఎంతో తెలుసా..?

చాలా సార్లు పోస్ట్ పోన్ అయ్యాక ఎట్టకేలకు రిలీజ్ అయిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్( Prabhas ) నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆదిపురుష్’( Adipurush ).కృతి సనన్ ( Kriti Sanon )హీరోయిన్ గా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్( Om Raut ) తెరకెక్కించిన ఈ మైథలాజికల్ మూవీని ‘టి సిరీస్ ఫిలిమ్స్’ ‘రిట్రోఫిల్స్ బ్యానర్ల పై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ కలిసి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు.

 Adipurush 7 Days Box Office Collection, Collections ,adipurush, Prabhas ,-TeluguStop.com

సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్, వంటి వారు కూడా కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ జూన్ 16 న ఈ చిత్రం హిందీ, తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఏకకాలంలో విడుదలయ్యింది…అయితే ఈ సినిమా కి రిలీజ్ రోజు నుంచే మిక్సెడ్ టాక్ రావడం తో ఈ సినిమా కలెక్షన్స్ మొడతీడు రోజుల తరువాత చాలా వరకు తగ్గినట్టుగా తెలుస్తుంది.

Telugu Adipurush, Bollywood, Kriti Sanon, Om Raut, Prabhas, Tollywood-Movie

ఇక హిందీలో ప్రభాస్ నటించిన స్ట్రైట్ మూవీ ఇదే కావడం విశేషం.మొదటి రోజు ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చిన కూడా ఓపెనింగ్స్ మాత్రం చాలా బాగా నమోదయ్యాయి.ఫస్ట్ వీకెండ్ ఈ మూవీ చాలా బాగా కలెక్ట్ చేసింది.

 Adipurush 7 Days Box Office Collection, Collections ,Adipurush, Prabhas ,-TeluguStop.com

కానీ సోమవారం నుండీ డ్రాప్స్ కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి.ఒకసారి 7 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తేఆదిపురుష్’ చిత్రానికి రూ.229.9 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది.ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.230 కోట్ల షేర్ ను రాబట్టాలి.మొదటి రోజు ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది.అయినప్పటికీ 7 రోజులు పూర్తయ్యేసరికి రూ.200.80 కోట్ల షేర్ ను రాబట్టింది.బ్రేక్ ఈవెన్ కి మరో రూ.30 కోట్ల షేర్ ను రాబట్టాలి.

Telugu Adipurush, Bollywood, Kriti Sanon, Om Raut, Prabhas, Tollywood-Movie

అది కూడా చిన్న టార్గెట్ అయితే కాదు.నెక్స్ట్ వీకెండ్ వరకు ఇలాగే కలెక్ట్ చేసి.రెండో వీకెండ్ కి మళ్ళీ గ్రోత్ చూపిస్తే.బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ లు ఉంటాయి… ఇక లేకపోతే ఈ సినిమా వల్ల కొంతమంది కి నష్టాలు రాక తప్పదు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube