జై సినిమా తో నటుడి గా మారిన వేణు ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్నారు…నిజానికి వేణుకి జబర్దస్త్ వల్లే కమెడియన్ గా మంచి గుర్తింపు వచ్చింది ఇక ఇప్పుడు బలగం సినిమా( Balagam ) డైరెక్షన్ చేసి సక్సెస్ సాధించిన వేణు… తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.ఈ సినిమా ఒక చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాన్ని అందుకుంది… ఇక ఈ సినిమాపై ఎంతోమంది సినీ సెలబ్రిటీలు ప్రశంసలు కురిపించడమే కాకుండా ఎంతో ప్రతిష్టాత్మకమైన అవార్డులను కూడా అందుకున్న సంగతి మనకు తెలిసిందే…

ఇక ఈ సినిమా చూసినటువంటి సెలబ్రిటీలు అందరూ కూడా వేణు దర్శకత్వ ప్రతిభ పై ప్రశంసలు కురిపించారు.ఇలా మొదటి సినిమాతో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన తదుపరి సినిమా పనులలో బిజీ అయినట్టు తెలుస్తుంది.ఈ క్రమంలోనే తన రెండవ సినిమాకు సంబంధించి కీలక అప్డేట్ విడుదల చేశారు.వేణు సోషల్ మీడియా ( Social media )వేదికగా స్పందిస్తూ పెన్ను పేపర్ ఉన్నటువంటి ఫోటోని షేర్ చేశారు…

అయితే ఈయన తన రెండవ సినిమా స్క్రిప్ట్ పనులలో బిజీగా మారిపోయారని తెలుస్తోంది.ఈ విధంగా వేణు రెండవ సినిమా పనులలో బిజీ అయిన సందర్భంగా అభిమానులు ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నారు.ఈ విధంగా తన రెండవ సినిమా కూడా చాలా మంచి సక్సెస్ అందుకోవాలని కోరుకుంటూ అభిమానులు ముందుగానే ఈయనకు ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ కామెంట్లు చేస్తున్నారు…
అయితే ఈ సినిమా కూడా ఎమోషనల్ కథతోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుందా ఇందులో హీరో హీరోయిన్స్ ఎవరు ఏంటి అనే విషయాలు మాత్రం తెలియడం లేదు…అయితే వేణు కి ఇలా రెండు సినిమా స్టార్ట్ అవ్వక ముందే కొంత మంది నిర్మాతల నుంచి తన మూడవ సినిమా కి కూడా అడ్వాన్స్ లు ఇచ్చినట్టుగా తెలుస్తుంది…ప్రస్తుతం అయితే ఆయన తన రెండవ సినిమా చేస్తున్నారు దీనికి సంభందించిన ఆఫిషియల్ అనౌన్స్ మెంట్ తొందర్లోనే రాబోతుంది…
.







